రాజకీయాల్లో అవినీతి మకిలి అంటని నేతల్లో అశోక్ గజపతి ఒకరు... లక్షల కోట్లకు అధిపతి అయిన ఈ రాజుగారి వంశపారంపర్య ఆస్తులు విద్యాసంస్థలు - బ్యాంకులు - ఆస్పత్రులకు ఇచ్చారు. ఇంకా వేలాది ఎకరాలు ట్రస్టు పేరుతో ఖాళీగా ఉన్నాయి. అదే ఇంకెవరైనా అయితే - అందులో భవంతులు నిర్మించో - ఇంకొకటో ఇంకొకటో చేసో ఆస్తులు పెంచుకునేవారు. కానీ, అశోక్ కుటుంబం మాత్రం ఉన్నది చాల్లే అనుకుంటూ సంతృప్తిగా ఉంటారు. గతంలో రాష్ట్రంలో రెవెన్యూ - ఆర్థిక శాఖలు వంటి కీలక శాఖలు నిర్వహించినా ఏ రోజూ ఎవరూ పల్లెత్తు ఆరోపణ చేయలేదు. అంతెందుకు..... సొంత జిల్లా విజయనగరంలో ఆయన రాజకీయ ప్రత్యర్థయిన బొత్స సత్యనారాయణ కూడా అశోక్ పై ఏనాడూ ఒక్క రూపాయి తిన్నారని అనలేదు. అలాంటి క్లీన్ ఇమేజి అశోక్ ది. నిధులన్నీ ప్రజల కోసం పూర్తిస్థాయిలో ఖర్చు చేస్తారు.
తాజాగా అశోక్ మరోసారి తన ప్రత్యేకత చాటుకున్నారు. ఎంపీ లాడ్స్ నిధుల్లో ఈ ఏడాది విడుదలైన రూ.5 కోట్లలో ఆయన సుమారు రూ.2 వేలు మినహా మిగతా అంతా నియోజకవర్గంలో ఖర్చు చేశారు. విద్య, వైద్య రంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ఆ మొత్తమంతా ఖర్చు చేశారట. ఆ నిదుల్లో సుమారు రూ.3 కోట్లు కేవలం ప్రభుత్వ విద్యాసంస్థల్లో బెంచీలు - టేబుళ్ల కోసం వినియోగించారట. అంతేకాదు... తాను దత్తత తీసుకున్న ద్వారపూడి గ్రామంలోనూ ఎంపీ నిధులతో పెద్ద ఎత్తున పనులు చేయించారట ఈ శ్రీమంతుడు.
కేటాయించిన నిధులను సద్వినియోగం చేయడంలో అశోక్ అందరికంటే ముందు నిలిచారట. కేంద్ర మంత్రిగా ఉంటూ తీరికలేని బాద్యతలు.. రాష్ట్ర ప్రయోజనాలు - ప్రత్యేక హోదా కోసం కేంద్రం వద్ద లాబీయింగ్ లో అధినేత చంద్రబాబుకు సహకరిస్తూ ఏమాత్రం ఖాళీ లేని ఆయన నియోజకవర్గం, దత్తతగ్రామాన్ని అభివృద్ధి చేయడంపై అంత శ్రద్ధ చూపడం గొప్ప విషయమే.
కొసమెరుపు: ఎంతో శ్రీమంతుడైన అశోక్ కేంద్రమంత్రి కాకమునుపు విజయనగరంలో అప్పుడప్పుడూ చిన్న నానో కారులో స్వయంగా డ్రైవింగు చేసుకుంటూ కనిపించేవారు. కావాలంటే కోట్లు విలువ చేసే విదేశీ కార్లు ఎన్ని కావాలంటే అన్ని కొనుగోలు చేయగలిగే ఆయన ఎంతో నిరాడంబరంగా తానే స్వయంగా నానో కారు నడుపుతూ షాపింగ్ చేసేవారు. ఎవరైనా పరిచయస్థులు - మీడియా విలేకరులు ఆజానుబాహుడు - అపర శ్రీమంతుడైన అశోక్ ను ''మీరు ఈ చిన్నకారులో ఏంటి సార్! పైగా డ్రైవర్ కూడా లేడు'' అని అంటే... ఆయన దానికి '' ఇది మంచి మైలేజి ఇస్తుంది.. ఇంధనం పొదుపు చేయడం దేశానికి అవసరం కదా.." అని చిరువనవ్వుతో సమాధానమిచ్చిన సందర్భాలున్నాయి.