దేవుడు మంత్రి. నిజానికి చాలా పవిత్రమైన పోస్ట్. మిగిలిన శాఖలను చూసే మంత్రులు మనుషులను పాలిస్తారు. దేవుడి మంత్రి చూసేది ఆ దేవదేవుడి పాలన. ఉత్తమోత్తమైన బాధ్యతలు అవి. అంటే ఆయన చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక రాగద్వేషాలకు అతీతంగా ఉండాలి. ఇదే విషయాన్ని టీడీపీ సీనియర్ నేత, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు సుతిమెత్తగా సుత్తి కొట్టకుండా చెప్పేశారు.
అయినది ఏదో అయినది. గతం గతహా. పాత్ర దేవుడు మంత్రి గారు చాలా చేశారు. మీరు పొరపాటున కూడా గత తప్పులు చేయవద్దు దేవుడి మంత్రి గారూ అని క్లారిటీగానే చెప్పేశారు. నాడు మంత్రి అయితే ఏకంగా రాజ్యాంగ వ్యతిరేక చర్యలకు పాల్పడ్డారు. నా ట్రస్టీ చైర్మన్ పదవినీ కూడా లేకుండా కాకుండా చేశారు. అక్షరాలా లక్షా నూట పదహార్ల రూపాయలను ట్రస్ట్ చైర్మన్ గా తాను రామతీర్ధం దేవుడి ఆలయానికి ఇస్తే ఆ చెక్కు నా ముఖాన కొట్టారని అశోక్ హాట్ కామెంట్స్ చేశారు.
అంతే కాదు మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్ గా జీతాలు ఇవ్వలని కోరితే క్రిమినల్ కేసులు పెట్టారని ఆయన ఫ్లాష్ బ్యాక్ విప్పి చెప్పారు. ఎన్ని చేసినా రాజ్యాంగాన్ని కాపాడేలా కోర్టులు సరైన తీర్పు ఇచ్చాయని, తాము కూడా కోర్టుల ద్వారా న్యాయాన్ని సాధించి తిరిగి పదవుల్లోకి వచ్చామని ఆయన గుర్తు చేశారు.
ఇపుడు కొత్త మంత్రిగా కొట్టు సత్యనారాయణ వచ్చారు. ఆయన అయినా పాత విషయాలను పక్కన పెట్టి పద్ధతిగా వ్యవహరించాలని అశోక్ కోరడం విశేషం. అంటే ఎటువంటి ద్వేష భావం పెట్టుకోకుండా మంచి కోసం పనిచేయాలని కూడా హితవు పలికారు. మరి అశోక్ వంటి పెద్దాయన చెబుతున్న మాటలను కొత్త మంత్రి దేవుడి బాధ్యతలు చూసే అమాత్యుడు వింటారా.
ఏమో ఇప్పటికే అటు మాన్సాస్ ట్రస్ట్ నుంచి, ఇటు సింహాచలం దేవస్థానం ట్రస్ట్ చైర్మన్ గిరీ నుంచి అశోక్ ని తప్పించి తప్పు చేసిన వైసీపీ పెద్దలు తగ్గుతారు అనే అనుకోవాలి. మరో వైపు హై కోర్టు కూడా ఇది తప్పు అని చెప్పి మళ్ళీ అశోక్ నే కుర్చీని అప్పగించిన క్రమంలో వైసీపీ మంత్రులు కూడా దాన్ని గమనించి జాగ్రత్తగా ఉంటారనే ఆశిస్తున్నారు. దానికి తోడు అశోక్ వంటి పెద్దలు చేస్తున్న సూచనలు, చెబుతున్న హితవుని దృష్టిలో పెట్టుకుంటే కనుక కొత్త దేవుడి మంత్రి నిజంగా జనాభినందనలు అందుకుంటారనే అంటున్నారు. సో ఏం జరుగుతుందో చూడాలి.