డు మహిళా దినోత్సవం .. ప్రపంచం మొత్తం ఈ రోజుని చాలా ఘనంగా సెలెబ్రేట్ చేస్తున్నారు. ఇలాంటి రోజున ఓ మహిళకి ఘోర అవమానం జరిగింది. ఏపీలో మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు విజయనగరంలో సోమవారం ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రచారానికి వచ్చిన మహిళపై అశోక్ గజపతి రాజు చేయిచేసుకున్నారు. తన అభిమాన నేత వచ్చారని గౌరవంతో పువ్వులు మహిళ పువ్వులు జల్లుతుండగా.. సహనం కోల్పోయిన గజపతిరాజు ఆ మహిళా కార్యకర్తను మెడలు వంచి మరీ కొట్టారు. దీంతో అవమానంగా ఫీల్ అయిన బాధిత మహిళ అక్కడి నుంచి వెళ్లిపోయారు.
దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. మాజీ మంత్రి.. అందులోనూ సౌమ్యుడిగా పేరు ఉన్న అశోక్ గజపతి రాజు చర్యపై వైసీపీ సహా ఇతర పార్టీలు మండిపడుతున్నాయి. ఎన్నికల్లో వరుస ఓటములతో ఇలా టీడీడీపీ నేతలు ఫ్రస్టేషన్ కు గురవుతున్నారని, వారి చర్యలు చూస్తే మున్సిపల్ ఎన్నికల్లలో ఓటమి తప్పదని అర్ధమవుతోందని అధికార పార్టీ నేతలు విమర్శిస్తున్నారు.
ఇటీవల టీడీపీ ఎమ్మెల్యే , సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఓ ఫోటో గ్రాఫర్ పై చేయిచేసుకున్న విషయం తెలిసిందే. హిందూపురంలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న బాలయ్య ... తన అనుమతి లేకుండా ఫోటోలు తీయడంతో సదరు ఫోటోగ్రాఫర్ చెంపమీద కొట్టాడు. ఆ వీడియో కూడా సోషల్ మీడియా లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉంటే .. దీనిపై మాన్సాస్ ట్రస్టు చైర్ పర్సన్ సంచయిత గజపతి స్పందించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుకునే తీరు ఇదేనా, అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. పురుష అహంకార భావజాలంతో ఉన్న ఒక మహిళా ద్వేషి నుంచి ఇంతకన్నా ఎక్కువ ఆశించలేం అని విమర్శించారు. అశోక్ గజపతిరాజు రామతీర్థం ఆలయానికి గౌరవ చైర్మన్ గా ఉన్నారని, ఇప్పుడాయన తన అసలు రంగు బయటపెడుతున్నాడని సంచయిత వ్యాఖ్యానించారు.