కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవి నుంచి రాహుల్ వైదొలగడం ఖరారు అయినట్టుగా ఉంది. ఈ విషయంలో ఇటీవలే స్పందించారు రాహుల్ గాంధీ. చేసిన రాజీనామాకు కట్టుబడి ఉన్నట్టుగా ఆయన ప్రకటించేశారు. తద్వారా కాంగ్రెస్ పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించక తప్పనిసరి పరిస్థితిని కల్పించారు రాహుల్ గాంధీ. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ కు జాతీయ స్థాయిలో కొత్త అధ్యక్షుడిగా ఎవరు నియమితం అవుతారనేది ఆసక్తిదాయకంగా మారింది.
ఈ జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేరు అశోక్ గెహ్లాట్. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారీయన. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు. ఈయనే కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవి దక్కనుందని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈ పదవిని తీసుకోవడానికి గెహ్లాట్ అంత సానుకూలంగా లేరట. రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది, అందుకే గెహ్లాట్ కాంగ్రెస్ జాతీయాధ్యక్ష పదవిని తీసుకోవడానికి రెడీగా లేరని సమాచారం.
అలా అధ్యక్ష పదవిని రాహుల్ నుంచి మరొకరికి ఇవ్వడం ద్వారా కాంగ్రెస్ పార్టీకి కుటుంబ పార్టీ ముద్రను తొలగించే ప్రయత్నం కూడా చేస్తారట. అయినా అధ్యక్ష పాత్రలో ఎవరు ఉన్నా డమ్మీనే అని - అసలు ఆట ఆడించేది సోనియా, రాహుల్ లే అని మాత్రం అందరికీ స్పష్టం అయ్యే అంశమే కాదా!
ఈ జాబితాలో ముందుగా వినిపిస్తున్న పేరు అశోక్ గెహ్లాట్. రాజస్థాన్ ముఖ్యమంత్రిగా ఉన్నారీయన. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల్లో ఒకరు. ఈయనే కాంగ్రెస్ పార్టీ జాతీయాధ్యక్ష పదవి దక్కనుందని ప్రచారం జరుగుతూ ఉంది. అయితే ఈ పదవిని తీసుకోవడానికి గెహ్లాట్ అంత సానుకూలంగా లేరట. రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వస్తుంది, అందుకే గెహ్లాట్ కాంగ్రెస్ జాతీయాధ్యక్ష పదవిని తీసుకోవడానికి రెడీగా లేరని సమాచారం.
గెహ్లాట్ ను రాజస్తాన్ ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించి సచిన్ పైలట్ కు ఆ అవకాశం ఇవ్వాలని కూడా కాంగ్రెస్ అధిష్టానం భావిస్తోందట. అందుకే గెహ్లాట్ ను అధ్యక్షుడిగా నియమించే ఆలోచన చేస్తున్నారట.