బీజేపీ పాలిత మరో రాష్ట్రంలో బుల్‌డోజర్ రాజకీయం..మదర్సాను కూల్చేశారు!
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో బుల్‌డోజర్ సంస్కృతి పెరిగిపోతోంది. ఇప్పటి వరకు యూపీ వరకే పరిమితం అనుకున్న ఈ విధానం.. ఇప్పుడు అసోం కుకూడా పాకింది. తాజాగా ఇక్కడ ఉగ్రవాద సంస్థలతో సంబంధముందని మదర్సాను కూల్చివేశారు. బొంగాయ్గావ్ జిల్లాలో కబైతరి మా అరిఫ్ అనే మదర్సాను నేలమట్టం చేశారు. జిహాదీ కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నారని మదర్సాను కూల్చివేసినట్లు అధికారులు చెప్పారు.
ఇటీవలే బంగ్లాదేశీ జిహాదీ సంస్థలతో సంబంధం ఉన్న మదర్సా నిర్మాణాలను తొలగించిన అసోం ప్రభుత్వం.. తాజాగా మరో మదర్సాను కూల్చివేయడం సంచలనంగా మారింది.
అల్ ఖైదా ఉగ్రవాద సంస్థతో సంబంధం ఉన్నాయనే ఆరోపణలతో గతవారమే మదర్సా ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు పోలీసులు. మదర్సాలో ఉగ్రవాద సంస్థలకు చెందిన కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు.
మరోవైపు మనుషులు నివసించేందుకు వీలు లేకుండా.. నిబంధనలను ఉల్లంఘించి మదర్సాను నిర్మించడం వల్లే కూల్చివేసినట్లు అధికారులు పేర్కొన్నారు.
మదర్సాలోని పిల్లలను వారి ఇళ్లకు సురక్షితంగా తరలించామని తెలిపారు. అంతకుముందు బంగ్లాదేశ్ ఉగ్రవాద సంస్థ అన్సరుల్ ఇస్లాంతో సంబంధాలున్న కేసులో అరెస్టైన ముఫ్తీ ముస్తాఫాకు చెందిన మదర్సాను కూల్చివేశారు. అతడితో పాటు మరో నిర్వాహకుడిని అరెస్ట్ చేశారు పోలీసులు.
ఈ మదర్సా కేంద్రంగా ముఫ్తీ ఉగ్రవాద కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు పోలీసులు అభియోగాలు మోపారు. మదర్సా కూల్చివేతకు కారణం.. అసోం జిహాదీ కార్యకలాపాలకు స్థావరంగా మారిందనే అని..ప్రభుత్వం చెబుతోంది. గత అయిదు నెలల్లో అన్సరుల్‌తో సంబంధమున్న అయిదు స్థావరాలపై దాడులు నిర్వహించారు. ఈ పరిణామాలపై రాజకీయంగా తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అయినా. కూడా.. బీజేపీ ప్రభుత్వం మాత్రం ఎక్కడా వెనక్కి తగ్గకపోవడం గమనార్హం.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.