చైనాలో వెలుగులోకి వచ్చిన ఈ వైరస్ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విలయ తాండవం సృష్టిస్తోంది. ప్రపంచంలోని దాదాపుగా అన్ని దేశాలు కూడా ఈ వైరస్ తో పోరాటం చేస్తున్నాయి. ఇక మనదేశంలో కూడా ఈ వైరస్ విజృంభిస్తుంది. ఇండియాలో ఇప్పటికే వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య రెండు లక్షలు దాటిపోయింది. అలాగే రోజురోజుకి నమోదైయ్యే పాజిటివ్ కేసులు భారీగా పెరిగిపోతున్నాయి. అయితే మన దేశంలో కేసులు పెరగడానికి మొన్నటి వరకు విదేశాల నుంచి వచ్చిన వారు, తబ్లీఘీ జమాత్ కారణమైతే.. ఇప్పుడు మాత్రం నిర్లక్ష్యం చేయడం ద్వారా కూడా వైరస్ పాజిటివ్ కేసులు పెరుగుతున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యంగా లాక్ డౌన్ నిబంధనలు, క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘించడం ద్వారా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. ఈ క్రమంలో అసోం ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై ఎవరైనా క్వారంటైన్ నిబంధనలు ఉల్లంఘిస్తే వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయడమే కాకుండా.. నాన్ బెయిలబుల్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తామని హెచ్చరించింది. ఈ మేరకు అసోం ఆరోగ్యశాఖ మంత్రి హిమాంత బిస్వాశర్మ శుక్రవారం ఓ ప్రకటన చేశారు.
అలాగే క్వారంటైన్ సెంటర్లలో ఏమైనా ఇబ్బందులుంటే సంబంధింత అధికారులకు, ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకురావాలని, అలా చేస్తే ఇబ్బందుల సమస్య తొలిగిపోతుందని, అలా కాకుండా రూల్స్ బ్రేక్ చేసి వ్యవహరిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ఇటీవల అక్కడికి వలస కూలీలు ఎక్కువగా వస్తుండటంతో.. ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.