అసోంకు చెందిన రజనీ మోడీకి రాసిన లేఖలో ఏముంది?

Update: 2020-06-29 05:15 GMT
దేశ ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నరేంద్ర మోడీ షురూ చేసిన కార్యక్రమాల్లో మన్ కీ బాత్ ఒకటి. అప్పటికప్పుడు దేశంలో జరుగుతున్న వివిధ అంశాల్నిప్రస్తావించటంతో పాటు.. తన వరకు వచ్చిన చాలా విషయాల్ని దేశ ప్రజలతో నేరుగా పంచుకోవటం చూస్తున్నదే. తాజాగా ఆయన నోట వచ్చిన మాటలు దేశ వ్యాప్తంగా కొత్త చర్చకు తెరతీసేవిగా చెప్పాలి. ఇప్పటివరకూ దేశ ప్రధానులుగా బాధ్యతలు చేపట్టిన వారెవరి నోటి నుంచి రాని రీతిలో ప్రధాని మోడీ నోటి నుంచి తాజాగా వచ్చాయని చెప్పాలి.

ఇప్పటి వరకూ సోషల్ మీడియా లోనూ.. మరి కొన్ని వేదికల మీద కొద్ది మంది మాత్రమే మాట్లాడే స్వదేశీ వస్తువుల్ని కొనాలన్న ‘సంఘ్’ మాట తాజా గా ప్రధాని మోడీ నోటి నుంచి వచ్చింది. ఆర్థిక వ్యవస్థ ను గాడి లో పెట్టేందుకు ప్రజలు వోకల్ ఫర్ లోకల్ పెంచాల్సిన అవసరం ఉందన్న విలువైన వ్యాఖ్యను చేశారు.

ఈ సందర్భంగా ఆయనో ఆసక్తికర విషయాన్ని చెప్పుకొచ్చారు. అసోం నుంచి రజనీ అనే మహిళ తనకు లేఖ రాశారని.. అందులో చైనా ఘర్షణ తర్వాత తాను స్థానిక వస్తువులనే కొంటున్నట్లు ఆమె పేర్కొన్నారన్న ఆయన.. స్వదేశీ వస్తువుల్ని కొనుగోలు చేయాలని కోరారు.

చైనా వైఖరిపైనా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. లద్దాఖ్ లోని భారత భూభాగంపై కన్నేసిన వారికి మన సైన్యం తగిన గుణపాఠం చెప్పిందని.. సైనికుల శౌర్యమే భారత్ బలమన్న ప్రధాని.. దేశ ఆత్మగౌరవాన్ని దెబ్బ తీయబోమని చైనా సైనికులతో పోరాడిన మరణించిన ఇరవై మంది వీర సైనికులు రుజువు చేశారని చెప్పారు. చైనాకు నేరుగా హెచ్చరికలు జారీ చేయటంతో పాటు..స్వదేశీ వస్తువుల్ని కొనేందుకు ప్రజలు ప్రాధాన్యత ఇవ్వాలన్న విషయాన్ని చెప్పేందుకు అసోం రజనీ అనే మహిళ ఉదంతాన్ని ఉదాహరణగా చెప్పారని చెప్పాలి. ఏమైనా.. స్వదేశీ వస్తువుల్నికొనమని చెప్పటానికి ముందు.. స్వదేశీ వస్తువుల తయారీని ప్రోత్సహించేలా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది కదా? కొనమని చెప్పే ముందు.. మార్కెట్లో స్వదేశీ వస్తువులు దండిగా దొరికేలా ఏర్పాట్లు చేస్తే మరింత బాగుంటుంది కదా? ఆ విషయాన్ని మోడీ మాష్టారు ఎందుకు మిస్ అయినట్లు?
Tags:    

Similar News