కర్ణాటకలో అధికార బీజేపీకి ప్రజల చేతిలో దిమ్మతిరిగింది. సాక్షాత్తూ అధికారంలో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేని ప్రజలు పరుగెత్తించి మరీ చితకబాదారు. ఈ ఘటన కర్ణాటకలోని చిక్కమగళూరులోని హుల్లేమేన్ గ్రామంలో కలకలం రేపింది. గ్రామస్తుల దాడిలో ఎమ్మెల్యేకి బట్టలు కూడా చినిగిపోయాయి.
ఇంతకూ గ్రామస్తులకు ఇంత ఆగ్రహం ఎందుకొచ్చిందనేగా మీ సందేహం..?
ఏనుగు దాడిలో ఓ మహిళ మరణించింది. దీంతో ఆమె మృతదేహంతో గ్రామస్తులు నిరసన చేపట్టారు. ఈ క్రమంలో గ్రామస్తులను పరామర్శించేందుకు బీజేపీ ఎమ్మెల్యే కుమారస్వామి అక్కడికి వచ్చారు. ఎన్నిసార్లు ఏనుగులను కట్టడి చేయాలని వినతిపత్రాలు ఇచ్చినా చర్యలు తీసుకోలేదంటూ ఆయనను ప్రజలు తరిమి తరిమి కొట్టారు.
మహిళ మృతిచెందాక ఇప్పుడా వచ్చేదంటూ ఎమ్మెల్యే కుమారస్వామిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే కూడా అంతే తీవ్రంగా సమాధానం ఇచ్చారు. దీంతో మరింతగా రెచ్చిపోయిన స్థానికులు ఎమ్మెల్యేపై దాడి చేశారు. ఊళ్లో నుంచి తరిమి కొట్టారు.
ఏనుగు దాడిలో జనం ప్రాణాలు కోల్పోతున్నా ప్రభుత్వానికి పట్టదా అని మండిపడ్డారు. ఈ ఘటనలో ఆయన దుస్తులు సైతం చిరిగిపోయాయి. పోలీసులు కల్పించుకుని అతికష్టమ్మీద ఎమ్మెల్యేను స్థానికుల బారి నుంచి కాపాడటంతో బీజేపీ ఎమ్మెల్యే ప్రాణాలతో బయటపడ్డారు.
కాగా చిక్కమగళూరు చుట్టుపక్కల ప్రాంతాల్లో ఇటీవల ఏనుగులు స్వైరవిహారం చేస్తున్నాయి. తరచు ప్రజలపై దాడి చేస్తున్నాయి. ఏనుగుల బారినపడి పొలాలు నష్టపోవడంతో తమవారి ప్రాణాలు కోల్పోతున్నామని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నోసార్లు ఎమ్మెల్యేకి, అధికారులకు తమ సమస్యను పరిష్కరించాలని వినతిపత్రాలు కూడా సమర్పించారు. అయినా ఫలితం శూన్యం.
తాజాగా నవంబర్ 20న హుల్లేమేన్ గ్రామానికి చెందిన ఓ మహిళపై ఏనుగు దాడి చేసి చంపేసింది. దీంతో ఆగ్రహించిన గ్రామస్తులు మృతదేహంతో ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలోనే ఎమ్మెల్యే ఆ మహిళ మృతదేహాన్ని చూడటానికి వచ్చినప్పుడు ఆయనపై దాడి జరిగింది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.