తెలంగాణ సీఎం కేసీఆర్ కు అత్యంత ఆప్తుడు.. ప్రస్తుతం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఓసీ సామాజిక వర్గానికి చెందిన(బ్రాహ్మిన్) సోమేశ్ కుమార్ కు పదవీ గండం ఏర్పడనుంది. ఆయనను తక్షణమే.. ఏపీకి కేటాయించాలంటూ.. కేంద్ర ప్రభుత్వమే వాదనలు వినిపించింది.
ఇప్పటి వరకు తెలంగాణ ప్రభుత్వంలో కీలక అధికారిగానే కాకుండా.. సీఎం కేసీఆర్‌కు అన్ని విధాలా అనుకూలమైన అధికారిగా కూడాఆయన పేరు తెచ్చుకున్నారు. గతంలో హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ కమిషనర్ గా ఉన్న ఆయనను అనూహ్యంగా కేసీఆర్ సీఎస్ పదవికి ఎంపిక చేసుకున్నారు.
అంతేకాదు... కేంద్రం స్థాయిలో లాబీయింగ్ కూడాచేసి.. సోమేశ్ ను తన పేషీకి తరలించుకున్నారు.అ యితే.. ఇప్పుడు మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోమేశ్ కుమార్ ను ఏకంగా తెలంగాణ నుంచి ఏపీకి బదిలీ చేయాలని.. కేంద్రమే కోరడం గమనార్హం. విషయంలోకి వెళ్తే.. అఖిల భారత స్థాయి అధికారుల క్యాడర్ కేటాయింపులపై డిపార్ట్‌మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రెయినింగ్(డీవోపీటీ)దే పూర్తి అధికారమని కేంద్ర ప్రభుత్వం తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ సూర్య కరణ్ రెడ్డి హైకోర్టుకు నివేదించారు.
ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత అఖిల భారత స్థాయి అధికారుల కేటాయింపులకు సంబంధించి ఐదుగురు సభ్యులతో వేసిన ప్రత్యేక కమిటీ సిఫార్సుల మేరకే ఏపీ, తెలంగాణకు కేటాయింపులు చేశామని తెలిపారు. తనను ఏపీకి కేటాయించడాన్ని సవాల్ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్(క్యాట్)ను ఆశ్రయించారు. సోమేశ్ పిటిషన్‌ను విచారించిన క్యాట్... ఆయన్ను తెలంగాణకు కేటాయిస్తూ గతంలో ఉత్తర్వులు జారీచేసింది.
అయితే.. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ కేంద్ర ప్రభుత్వం దాఖలు చేసిన అప్పీల్‌ను న్యాయమూర్తులు జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ సూరేపల్లి నందలతో కూడిన ధర్మాసనం గురువారం మరోసారి విచారించింది. ఏపీకి కేటాయించిన 15 మంది ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు క్యాట్ ను ఆశ్రయించి తెలంగాణకు కేటాయించేలా ఉత్తర్వులు పొందారని తెలిపారు.
క్యాట్ ఉత్తర్వులను రద్దు చేసి సోమేశ్ కుమార్ ను ఏపీకి కేటాయించేలా ఆదేశించాలని అదనపు సొలిసిటర్ జనరల్ కోరారు. దీనిపై తుది తీర్పు ఎలా ఉంటుందో చూడాలి.