వైసీపీ నేతల్ని ఉక్కిరిబిక్కిరి చేసేలా అచ్చెన్నాయుడి పాయింట్లు

Update: 2022-05-25 10:37 GMT
కోనసీమ జిల్లాకు ముందు అంబేడ్కర్ పేరును పెట్టాలన్న జగన్ ప్రభుత్వ నిర్ణయంపై పెద్ద ఎత్తున నిరసన.. ఆందోళన చోటు చేసుకోవటం.. ఈ సందర్భంగా జరిగిన హింసాకాండ రెండు తెలుగు రాష్ట్రాల్లో  షాకింగ్ గా మారింది. ప్రశాంతతకు మారుపేరుగా చెప్పే కోనసీమ ఇంతలా తగలబడటమా?

ఇంతటి హింసాకాండ చోటు చేసుకోవటమా? ఇదెలా సాధ్యమైంది? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎప్పటి మాదిరే.. ఈ ఉదంతానికి బాధ్యత మీదేనంటూ ఏపీ అధికారపక్షం విపక్ష టీడీపీ.. జనసేనలపై ఆరోపణలు చేస్తే.. దానికి ఖండనలు మొదలు పెట్టారు విపక్ష నేతలు.

తాజాగా మీడియాతో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు సంధించిన ప్రశ్నాస్త్రాలు వైసీపీని ఉక్కిరిబిక్కిరి చేసేలా మారాయి. మంత్రి.. ఎమ్మెల్యే ఇంటిపై దాడి జరిగి.. నిప్పు పెట్టారంటే అది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యమేనని విమర్శించిన అచ్చెన్న.

తమ పార్టీకి చెందినట్లుగా ప్రచారం జరుగుతున్న అన్నం సాయి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. హింసాకాండలో కీలకభూమిక పోషించినట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న సాయిపై అచ్చెన్న షాకింగ్ అంశాల్ని వెల్లడించారు.

"అన్నం సాయి అనే యువకుడు ఎవరు. గతంలో విశ్వరూప్ ఆయన్ను ఎందుకు సన్మానించారు? అతను టీడీపీ వ్యక్తి అయితే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామక్రిష్ణారెడ్డి ఆయన్ను ఎందుకు కౌగిలించుకొని ఫోటో దిగుతాడు?" అని ప్రశ్నించారు. విధ్వంసాలు చేయటం వైఎస్సార్ కుటుంబానికి వెన్నతో పెట్టిన విద్యగా అభివర్ణించిన ఆయన.. కొన్ని ఉదాహరణల్ని ప్రస్తావించారు. అచ్చెన్న చేసిన వ్యాఖ్యల్లో కీలకమైనవి చూస్తే.

-  వైఎస్ రాజశేఖర్ రెడ్డి హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోతే రిలయన్స్ వాళ్లు చంపేశారని ఆరోపిస్తూ వారి షాపులను విధ్వంసం చేయించింది జగన్ కాదా?
-  తునిలో రైలు తగలబెట్టింది వైసీపీ కాదా?
-  ముఖ్యమంత్రి పదవి కోసం కోడికత్తి డ్రామా ఆడిందెవరు?
-  సొంత బాబాయ్ ను ఇంట్లో చంపి ఎవరో చంపినట్లుగా బయటకు క్రియేట్ చేసిన వ్యక్తి జగన్
-  ప్రభుత్వంపై వ్యతిరేకత వచ్చినప్పుడు ఏదో ఒక ఇష్యూను తీసుకొచ్చి డైవర్ట్ చేస్తున్నారు.
-  వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యంను చంపి తీసుకొస్తే దాన్ని యాక్సిడెంట్ గా చిత్రీకరించారు. ఈ అంశంపై వైసీపీ ప్రభుత్వానికి చెడ్డపేరు వచ్చింది. దీన్నించి డైవర్ట్ చేయటానికే అమలాపురంలో విధ్వంసానికి పూనుకున్నారు. ఇదంతా ప్లాన్ ప్రకారం జరిగింది.  
-  ఇంతటి ఘటన జరిగినతర్వాత సీఎం జగన్ ఉలకలేదు.. పలకలేదు.. కనీసం ప్రజలు శాంతియుతంగా ఉండాలని చెప్పాలి కదా?
-  కానీ.. తాము మాత్రం సాధారణ పరిస్థితి వచ్చేందుకు అందరూసహకరించాలని టీడీపీ నుంచి కోరుతున్నాం.
Tags:    

Similar News