పోలీసులు అడ్డుకుంటున్నా.. కత్తులు.. కర్రలతో బీజేపీ కార్యకర్తల పై దాడి!

Update: 2022-01-26 05:02 GMT
నిజామాబాద్ ఎంపీ కమ్ ఫైర్ బ్రాండ్ నేతగా గుర్తింపు ఉన్న ధర్మపురి అర్వింద్ పై దాడి జరిగిన సంగతి తెలిసిందే. నిజామాబాద్జిల్లా పర్యటనలో భాగంగా ఆయనపైనా.. బీజేపీ కార్యకర్తలపై దాడి జరిగిన వైనంపై వార్తలు వచ్చినప్పుడు అంచనా వేసిన తీవ్రతకు.. అందులో చోటుచేసుకున్న పరిణామాలకు సంబంధించి ఒక ప్రముఖ మీడియా సంస్థకు చెందిన వీడియోలో వెల్లడైన సీన్లను చూస్తే నోట మాట రాని పరిస్థితి. మరీ.. ఇంత దారుణంగా దాడికి పాల్పడ్డారా? అన్న షాక్ కు గురి కాక మానదు. పక్కనే పోలీసులు అడ్డుకుంటున్నా.. లెక్క చేయకుండా కత్తులతో.. కర్రలతో దాడి చేసిన వైనం చూసినప్పుడు కానీ ఎంత భారీ ఎత్తున దాడి జరిగిందన్న విషయం అర్థం కాక మానదు. దీనికి సంబంధించి వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది.

ఎంపీ అర్వింద్ వాహన శ్రేణిపై రాళ్లు..కర్రలతో దాడి చేయటం.. ఇందులో భాగంగా కారు అద్దాలు ధ్వంసం కావటం ఒక ఎత్తు అయితే.. బీజేపీ కార్యకర్తల్ని ఉరికించి.. ఉరికించి కొట్టటం.. కొందరి మీద అయితే ఏకంగా కత్తులతోతెగ బడిన వైనం సంచనలంగా మారింది. ఈ దాడికి పాల్పడింది పసుపు రైతులు అని టీఆర్ఎస్ నేతలు చెబుతుంటే.. అదేమీ కాదు.. టీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మనుషులే అంటూ బీజేపీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.

ఈ దాడి ఘటనలో బీజేపీకి చెందిన ఆరుగురు కార్యకర్తల చేతులు.. కాళ్లు.. తలకు గాయాలు అయ్యాయి. పలువురికి చేతులు విరిగిపోయాయి. ఒక బీజేపీ కార్యకర్తపై దాడి చేస్తుంటే.. అతను పరిగెత్తుతున్నా వదలకుండా అతన్ని వెంబడించి మరీ కొట్టటం.. అతనుకింద పడితే.. ఆ వ్యక్తి మీద కత్తితో దాడి చేసే ప్రయత్నం చేయటం.. పోలీసులు అడ్డుకోవటంతో అతి కష్టమ్మీద ఆగిన వైనం వీడియోలో కనిపిస్తోంది.

ఇంత దారుణంగా దాడి జరిగిందా? అనిపించేలా ఉన్న ఈ వ్యవహారం.. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ - బీజేపీల మధ్య మరింత రాజకీయ రగడకు కారణమవుతుందన్న మాట వినిపిస్తోంది. తమ కార్యకర్తలపై టీఆర్ఎస్ నేతలు ఇనుపగుండ్లతో దాడి చేశారని.. వారికి పోలీసులు సహకరించినట్లుగా ఎంపీ ఆర్వింద్ తీవ్ర ఆరోపణలు చేయటం తెలిసిందే.








Full View


Tags:    

Similar News