దాయాది దేశం పాకిస్థాన్.. సాగిస్తున్న ఉగ్రవాద ప్రేరేపిత చర్యలకు అడ్డుకట్ట పడడం లేదు. ప్రపంచ వ్యాప్తంగా పాక్ దురాగతాలను భారత్ ఎండగడుతున్నా.. పాకిస్థాన్ పాలకులు గుణపాఠం నేర్వడం లేదు. ఇప్పటికే నిత్యం ఎల్ వో సీ(నియంత్రణ రేఖ) వెంబడి కాల్పులు జరుపుతూ.. ఇరు దేశాలు చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందానికి తూట్లు పొడుతున్న పాకిస్థాన్.. భారత సైన్యాన్ని కవ్విస్తూనే ఉంది. సరిహద్దు గ్రామాల ప్రజలను భీతిల్లేలా చేస్తూనే ఉంది. సైన్యం పరంగా .. ఒకవైపు ఇలా చేస్తూనే మరో వైపు.. ఉగ్ర వాదులను కూడా భారత్‌పైకి ఉసిగొల్పుతోంది.
ఇటీవల జరిగిన దీపావళి వేడుకల సందర్భంగా.. పలువురు ఉగ్ర వాదులను జమ్ము కశ్మీర్ పోలీసులు నిర్బంధించారు. దీపావళి ని పురస్కరించుకుని.. దేశంలో అల్లర్లు సృష్టించేందుకు ముఖ్యంగా సరిహద్దు రాష్ట్రాల్లో ఉగ్రవాద చర్యలను ప్రోత్సహించేందుకు పాకిస్థాన్ ప్రయత్నించిన విషయం.. ఆ టైంలో దేశవ్యాప్తంగా అలజడి రేపింది. దీంతో నిఘాను పెంచిన జమ్మ కశ్మీర్ భద్రతా దళాలు.. దీపావళి రోజే..నలుగురు తీవ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనలో ఆ రాష్ట్రానికి చెందిన సీనియర్ పోలీసు అధికారి మరణించారు. ఇలా ఎక్కడికక్కడ దాయాది దేశం తన బుద్ది పోనిచ్చుకోవడం లేదు.
తాజాగా.. హిందూ దేవాలయాలను టార్గెట్ చేసుకుని పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు... జమ్ముకశ్మీర్‌లో పెద్ద ప్లాన్ చేశారు. రాష్ట్రంలో మత సామరస్యాన్ని దెబ్బతీయాలనే కుట్రతో ఇక్కడ ఉగ్రదాడికి ప్లాన్ చేసినట్టు నిఘా వర్గాల నుంచి అందిన సమాచారంతో అప్రమత్తమైన.. భద్రతా దళాలు.. విస్తృత తనిఖీలు చేయడంతోపాటు.. జమ్ము ప్రాంతంలో నిఘాను పెంచారు. ఈ క్రమంలో నలుగురు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి బారీ ఎత్తున గ్రెనేడ్లను, ఉగ్ర పథక రచనకి సంబందించిన పత్రాలను, పారిస్థాన్ జెండాలను స్వాధీనం చేసుకున్నారు.
అంతేకాదు.. నిందితులకు గ్రేనేడ్లను ఎలా వినియోగించాలో నేర్పుతూ.. వీడియో పాఠాలను కూడా వారికి పంపినట్టు అధికారులు గుర్తించారు. ఇక, భద్రతా దళాలు అదుపులోకి తీసుకున్నవారిని జమ్ము కశ్మీర్ ఘనావీ ఫోర్స్(జెకేజీఎఫ్)కు చెందిన ఉగ్రవాదులుగా గుర్తించారు. హిందు ఆలయంపై దాడి చేయడం ద్వారా.. మత సామరస్యాన్ని దెబ్బతీసి భారత్‌లో అల్లర్లు సృష్టించాలనే ఏకైక లక్ష్యంతో పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు పక్కా ప్రణాళిక వేశారని అధికారులు తెలిపారు.