తెలంగాణ భవన్​ లో కాల్పులకు యత్నం.. టీఆర్​ఎస్​ నేత హల్ ​చల్​..!

Update: 2021-03-21 11:30 GMT
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్​ఎస్ ఘన విజయం సాధించింది. ప్రభుత్వ వ్యతిరేకత, నిరుద్యోగుల్లో అసంతృప్తి తదితర కారణాలు అన్నీ పటాపంచలు చేస్తూ టీఆర్​ఎస్​ నేతలు విజయడంకా మోగించారు. రెండు స్థానాల్లోనూ ఆ పార్టీ నేతలు .. రెండో ప్రాధాన్యత ఓట్లతో గెలుపొందారు. దుబ్బాక, జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో టీఆర్ఎస్​కు ప్రతికూల ఫలితాలు వచ్చాయి. అయితే ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీకి బూస్ట్​ ఇచ్చిందని చెప్పక తప్పదు. టీఆర్​ఎస్​ అధినేత కేసీఆర్​ వ్యూహాలు రచించడం.. వంటిని మంత్రులు - ఎమ్మెల్యేలు కింది స్థాయి నేతలు పక్కాగాఅమలు చేయడంతో ఈ విజయం దక్కింది.

హైదరాబాద్​ ఎమ్మల్సీ స్థానంలో సురభి వాణిదేవి - నల్లగొండ స్థానంలో పల్లా రాజేశ్వర్ ​రెడ్డి ఘనవిజయం సాధించారు. ఇదిలా ఉంటే గెలుపుతో టీఆర్ ​ఎస్​ శ్రేణులు రాష్ట్రవ్యాప్తంగా సంబురాల్లో మునిగిపోయాయి. అయితే తెలంగాణ భవన్ ​లో నిర్వహించిన సంబురాల్లో అపశ్రుతి నెలకొన్నది.  కార్యకర్తలు - నేతల అత్యుత్సాహంతో తెలంగాణ భవన్‌ లో అగ్నిప్రమాదం చోటుచేసుకున్నది. వెంటనే అప్రమత్తమైన సహయాయ దళాలు మంటలను ఆర్పాయి. ఇదిలా ఉంటే తెలంగాణ భవన్​లో జరిగిన మరో ఘటన కూడా తీవ్ర కలకలం రేపింది. టీఆర్​ఎస్​ శ్రేణులంతా జోరుగా సంబరాల్లో మునిగి పోయాయి. ఇంతలోనే ఓ నేత రివాల్వర్​ తీసి గాల్లోకి కాల్పులు జరపబోయాడు. ఈ ఘటన తీవ్ర వివాదాస్పదం అయ్యింది.

తెలంగాణ భవన్‌ లో జరిగిన వేడుకల్లో గ్రేటర్ మాజీ అధ్యక్షుడు కట్టెల శ్రీనివాస్ యాదవ్ రెచ్చిపోయారు. ఒక్కసారిగా తుపాకీ బయటికి తీశారు. పైకెత్తి అందరికీ చూపిస్తూ హల్‌ చల్ చేశారు. అంతేకాక గాల్లోకి కాల్పులు జరిపిందేకు యత్నించారు. దీంతో ఇతర నేతలు వెంటనే అతడిని సముదాయించడంతో వెనక్కి తగ్గారు. అయితే ఈ ఘటనపై కొందరు టీఆర్​ ఎస్​ నేతలు సీరియస్​ అయినట్టు సమాచారం. అధిష్ఠానం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.  సోషల్ ​మీడియాలోనూ ఈ ఘటన పై అవాకులు చెవాకులు పేలుతున్నాయి. గెలిస్తే మాత్రం అంతగా రెచ్చిపోవాలా బ్రో? అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
Tags:    

Similar News