పెరోల్ పై వచ్చి ప్రమాణస్వీకారం చేయనున్న ఎంపీ

Update: 2020-01-24 11:00 GMT
అత్యాచారం కేసులో జైల్లో ఉన్న ఆ నేత తాజాగా బయటకు రానున్నాడు. అది కూడా ఎంపీగా ప్రమాణస్వీకారం చేసేందుకు మాత్రమే. ఎనిమిది నెలల క్రితం ఎంపీగా గెలుపొందిన బీఎస్పీ నేత అతుల్ రాయ్ ఇప్పటివరకూ ప్రమాణస్వీకారం చేయలేదు. అత్యాచార కేసులో జైల్లో ఉన్న ఆయన తాజాగా పెరెల్ మీద బయటకు రానున్నట్లు చెబుతున్నారు. ఎంపీగా ప్రమాణస్వీకారం చేసి మళ్లీ జైలుకు వస్తాడని చెబుతున్నారు.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో యూపీలోని ఘోసీ పార్లమెంటు స్థానం నుంచి బీఎస్పీ అభ్యర్థిగా పోటీ చేసిన ఆయన.. ఎన్నికల్లో  విజయం సాధించారు. అయితే.. అత్యాచారం కేసులో ఆయన గత ఏడాది మేలో అరెస్టు అయి జైల్లో ఉన్నారు.

తనకు పెరోల్ మీద బయటకు వచ్చే అవకాశం ఇస్తే.. ఎంపీగా ప్రమాణస్వీకారం చేస్తానని అతుల్ రాయ్ చేసుకున్న వినతిపై కోర్టు సానుకూలంగా స్పందించింది. రెండు రోజుల పాటు ఆయన్ను జైలు నుంచి విడుదల చేయనున్నారు. పోలీసుల సమక్షంలో జనవరి 29న ఢిల్లీకి వెళ్లి ప్రమాణస్వీకారం చేసి తిరిగి జనవరి 31న నాటికి జైలుకు రావాలని కోర్టు పేర్కొంది. తనను రాజకీయ ప్రత్యర్థులే అత్యాచార కేసులో ఇరికించినట్లు వాపోతున్న సదరు ఎంపీ గతంలో బెయిల్ కోసం పిటిషన్ దాఖలు చేసినా.. కోర్టు సానుకూలంగా స్పందించలేదు.
Tags:    

Similar News