తాను మోడీ కూతురిని అని మొదలుపెట్టి.. అందులో చిన్న ట్విస్టుతో క్లారిటీ ఇచ్చిన గుజరాతీ నటి - హాట్ మోడల్ అవని మోడీ పాపులారిటీ తెగ పెరుగుతోందట. మోడీ గ్రాఫ్ పెరుగుతున్న కొద్దీ అవనీ గ్రాఫ్ కూడా పెరుగుతోందట. మొన్న యూపీ ఎన్నికల్లో బీజేపీ అద్భుత విజయం అందుకున్న తరువాత అవని మోడీ పాపులారిటీ కూడా బాగా పెరిగిందట. అందుకు కారణం.. ఆమె రెండేళ్ల కిందట చేసిన వ్యాఖ్యలే. తాను మోడీ కూతురినని ఆమె అప్పట్లో చెప్పడం.. అప్పటి నుంచి ఆమె ఎక్కడ కనిపించినా మీడియా - ప్రజలు ఆమెను మోడీ కూతురు అంటూ సంబోధిస్తుండడంతో ఆమె పాపులారిటీ మరింత పెరుగుతోంది.
రెండేళ్ల కిందట ఓ సందర్భంలో అవని తాను ప్రధాని మోడీ కూతురినని చెప్పింది. దేశమంతా షాక్ కు గురయిన ఆ సమయంలో వెంటనే ఆమె.. తానేకాదు దేశంలోని ప్రతి ఆడపిల్లా మోడీ కూతురేనంటూ ట్విస్టు ఇచ్చింది. దేశంలోని అమ్మాయిలందరికీ ఆయన తండ్రిలాంటివారన్నది ఆమె అభిప్రాయం. మీ పేరు వెనుక మోడీ ఉంది...మీరు ప్రధాని నరేంద్రమోడీకి బంధువా అంటూ మీడియా అడిగిన ప్రశ్నకు అలా సమాధానమివ్వగా ఇప్పటికీ ఆ విషయం ఇంకా జనం నోళ్లలో నానుతూనే ఉంది.
ఒక చిన్న సమాధానంతో దేశమంతటి దృష్టిని ఆకర్షించిన ఆమె అప్పటి నుంచి మోడీ ఏ విజయం సాధించినా ఏదో ఒకరకంగా మీడియా ఆమెను టచ్ చేయడం.. ఆమె ఏదో చెప్పడం.. ఇలా జరుగుతూ తెగ పాపులర్ అవుతోంది. కాగా అవనిది కూడా గుజరాతే. మోడీతో ఎలాంటి బంధుత్వం లేని ఆమె క్యాలండర్ గళ్స్ అనే ఒక సినిమాలో నటించింది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/