అయోధ్య తీర్పు: రెండు పిటీషన్ల కొట్టివేత

Update: 2019-11-09 06:28 GMT
అయోధ్య వివాదంపై చారిత్రిక తీర్పు నిస్తున్న సుప్రీం కోర్టు ధర్మాసనం తాజాగా  అంతకు ముందు ఈ వివాదాస్పద భూమి తమ దేనని  షియా బోర్డు దాఖలు చేసిన పిటీషన్ కొట్టివేసింది.

అయోధ్య వివాదం పై సుప్రీం కోర్టు ధర్మాసనం లోని ఐదుగురు జడ్జీలు ఏకాభి ప్రాయంతో తీర్పును వెలువరించారు. బాబ్రీ మసీదు ఎప్పుడు ఖచ్చితం గా నిర్మించారో చారిత్రక ఆధారాలు లేవని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్  వ్యాఖ్యానించారు.

ఇక హిందూ సంస్థ నిర్మోహీ అఖాడా పిటీషన్ ను కూడా సుప్రీం కోర్టు కొట్టి వేసింది. మత గ్రంథాలను  బట్టి కోర్టు తీర్పు ఉండదని.. నిర్మోహీ పిటీషన్ కాలం చెల్లిందని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. ఖాళీ ప్రదేశం లో బాబ్రీ మసీదు ను కట్ట లేదని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ అభిప్రాయ పడ్డారు. పురావస్తు పరిశోధనల ప్రకారం 12వ శతాబ్ధం లోనే ప్రార్థనా స్థలం ఉందని చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ తెలిపారు. అయితే అది రాముడి దేవాలయం అని చెప్పేందుకు ఆధారాలు లేవని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది.

ఇక హిందూ రాముడి దేవాలయాన్ని ధ్వంసం చేసి బాబ్రీ మసీదును కట్టారనడానికి పురావస్తు ఆధారాలు లేవని సుప్రీం కోర్టు చెప్పింది. 12-16 శతాబ్ధాల మధ్య అక్కడ ఏముందో చెప్పేందుకు పురావస్తు శాఖ వద్ద ఖచ్చితమైన ఆధారాలు లేవని సుప్రీం కోర్టు అభిప్రాయ పడింది. హిందువులు ఈ స్థలాన్ని రాముడి జన్మ భూమిగా భావిస్తున్నారని..దీనిపై ఎలాంటి వివాదానికి తావు లేదని సుప్రీం కోర్టు అభిప్రాయపడింది.
Tags:    

Similar News