ఏపీ మంత్రి అయ్యన్నపాత్రుడు సొంత ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎంతో గొప్పగా చెప్పుకొంటున్న కార్యక్రమాలన్నీ వేస్టని ఆయన ఒక్క మాటలో కొట్టిపడేశారు. పనికిమాలిన విశాఖ ఉత్సవానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తున్నారంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు.
నర్సీపట్నంలో శనివారం నిర్వహించిన డీఎల్డీఏ-పశుసంవర్థకశాఖ ఆధ్వర్యంలో పాలపోటీ -అందాల పోటీ - లేగదూడల ప్రదర్శనలను మంత్రి అయ్యన్న ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు ఉపయోగపడే ఇటువంటి కార్యక్రమాలను ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని... పనికిమాలిన ఉత్సవాలకు మాత్రం పెద్ద పీట వేస్తోందని అన్నారు.
అయ్యన్నపాత్రుడు చేసిన విమర్శలు టీడీపీలో చాలామంది నేతలకు కొత్త కాకపోయినా ఆయన ఇలా బహిరంగంగా మాట్లాడడంతో విపక్షాలకు ఆయుధం దొరికినట్లయింది. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసే పనులు ఆయన కేబినట్లోని మంత్రులకే నచ్చడం లేదంటూ విమర్శిస్తున్నారు. ఇక ముఖ్యమంత్రి ప్రజలకు ఏదో చేస్తారని ఆశపడడం వేస్టని వారంటున్నారు. కాగా విశాఖలో మరో మంత్రి గంటాకు చంద్రబాబు బాగా ప్రయారిటీ ఇస్తుండడం.. గంటా అడుగడుగునా అయ్యన్నకు అడ్డు తగులుతుండడంతో అయ్యన్న రగిలిపోతున్నారని.. ఆ క్రమంలోనే గంటాకు అండగా నిలుస్తున్న చంద్రబాబుపై ఆయన విమర్శలు గుప్పిస్తున్నారని తెలుస్తోంది.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/