ఏపీ మంత్రుల్లో అయ్యన్న పాత్రుడు ఇప్పుడు ప్రత్యేకంగా మారారు. ఆయన భద్రత విషయంలో ఏపీ సర్కారు ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇప్పటివరకూ ఆయనకు కల్పిస్తున్న భద్రతను భారీగా పెంచటంతో పాటు.. ఆయనకు ప్రత్యేకంగా బుల్లెట్ ఫ్రూప్ వెహికిల్ ను అందజేశారు.
విశాఖలోని బాక్సైట్ తవ్వకాలపై ఏపీ సర్కారు ప్చజెండా ఊపేయటం.. మరోవైపు గిరిజనులు దీన్ని తీవ్రంగా వ్యతిరేకించటంతో పాటు.. మావోల నుంచి వార్నింగ్ లు వస్తున్నాయి. బాక్సైట్ తవ్వకాలకు సంబంధించి నేరుగా ప్రభావం ఉండే అయ్యన్న పాత్రుడిపై మావోలు గురి పెట్టొచ్చన్న సందేహాల నడుమ ఆయనకు కల్పిస్తున్న భద్రతను భారీగా పెంచాలని నిర్ణయించారు.
ఇందులో భాగంగా ఆయనకు బుల్లెట్ ఫ్రూప్ కారును ప్రభుత్వం అందజేసింది. ఇకపై.. ఆయన సదరు బుల్లెట్ ఫ్రూప్ వెహికిల్ లోనే జర్నీ చేయనున్నారు. దీంతో పాటు.. ఆయన ఇంటి ప్రవేశ ద్వారం వద్ద ప్రత్యేకంగా మెటల్ డిటెక్టర్ ను ఏర్పాటుచేశారు. మంత్రిని కలవటానికి వచ్చే ప్రతి ఒక్కరిని క్షుణ్ణంగా చెక్ చేసిన తర్వాత మాత్రమే లోపలకు అనుమతిస్తున్నారు. మావోల నుంచి ముప్పు ఉందని అంచనా వేస్తున్న నేపథ్యంలో అయ్యన్నకు అవసరమైన అన్నీ జాగ్రత్తల విషయంలో రాజీ పడకూడదంటూ భద్రతా వర్గాల్ని ఏపీ సర్కారు ఆదేశించినట్లు చెబుతున్నారు.