ఐపీఎల్ దేశంలోని ప్రధాన నగరాల్లో జరిగింది. అయితే బెంగళూరుతో సమానంగా హోదా ఉన్న కూడా హైదరాబాద్ ను వదిలేసి అహ్మదాబాద్ కు ఐపీఎల్ పండుగను పట్టుకెళ్లిపోయారు. హైదరాబాద్ క్రికెట్ లో కుమ్ములాటలు, అవినీతి ఆరోపణలు రావడం.. మ్యాచ్ లు నిర్వహించే పరిస్థితి లేవన్న ఆరోపణలతోనే భాగ్యనగరానికి మ్యాచ్ లు కేటాయించలేదన్న విమర్శలు వచ్చాయి.
ప్రధానంగా హైదరాబాద్ క్రికెట్ సంఘం ఇప్పుడు రెండుగా చీలిపోయింది. ఒకటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు మహ్మద్ అజారుద్దీన్ వర్గం కాగా.. ఆయన ప్రత్యర్థి వర్గం మరో వైపు నిలిచి కుమ్ములాటలతో క్రికెట్ సంఘాన్ని భ్రష్టు పట్టిస్తున్నారన్న ఆరోపణలున్నాయి.
ఇప్పటిదాకా అజారుద్దీన్ ను అధ్యక్ష పదవి నుంచి దించడానికి నిర్ణయం తీసుకున్న హైదరాబాద్ క్రికెట్ సంఘం కార్యవర్గానికి చెక్ చెప్పేందుకు అజారుద్దీన్ రంగంలోకి దిగారు. తాజాగా దూకుడుగా ముందడుగు వేస్తున్నారు.
అజారుద్దీన్ తాజాగా వివాదాస్పద అంబుడ్స్ మన్ దీపక్ వర్మ రెండు రోజుల కిందట కార్యవర్గ సభ్యులను తాత్కాలికంగా సస్పెండ్ చేశారు. క్రికెట్ కార్యకలాపాల నిర్వహణకు అజార్ కొత్త టీంను సిద్ధం చేసుకున్నారు. ప్రస్తుత ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్థానంలో తానే సెక్రటరీగా అదనపు బాధ్యతలు తీసుకుంటున్నట్టు అజార్ తెలిపారు. ఇక ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్,సంయుక్త కార్యదర్శి నరేశ్ శర్మ బదులు సుభద్ర సూరి ఆ బాధ్యతలను తీసుకుంటున్నట్టు అజర్ ఒక లేఖను విడుదల చేశారు.
ఇక కోశాధికారిగా సంతోష్, కౌన్సిలర్ పార్థ్ సత్వాల్కర్ కు అదనపు బాధ్యతలు అప్పగిస్తున్నట్టు అజార్ పేర్కొన్నాడు.కాగా అజార్ వ్యవహరశైలిపై ప్రత్యర్థి వర్గం కూడా మండిపడుతోంది. ఇక ఈనెల 12 నుంచి టైగర్ టీ20 కప్ తొలి సీజన్ ప్రారంభమవుతుందని.. దాన్ని అజారుద్దిన్ ఒక్కడే నిర్వహించడానికి రెడీ అవుతున్నట్టు తెలిసింది. మరి ప్రత్యర్థి వర్గం ఎలా అజార్ ను కట్టడి చేస్తుందనేది ఆసక్తిగా మారింది..
-హెచ్.సీ.ఏ వివాదం ఇదీ..
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్.సీ.ఏ) అంతర్గత విభేదాలు రచ్చకెక్కాయి. ప్రతిరోజు ఏదో ఒక వివాదం చెలరేగుతూనే ఉంది. అపెక్స్ కౌన్సిల్ ఇప్పటికే హెచ్.సీ.ఏ అధ్యక్షుడిగా అజారుద్దీన్ ను తొలగించింది. తాత్కాలిక అధ్యక్షుడిని నియమించింది. ప్రస్తుత ఉపాధ్యక్షుడు జాన్ మనోజ్ ను అపెక్స్ కౌన్సిల్ తాత్కాలిక అధ్యక్షుడిగా చేసింది.దీనిపై అజారుద్దీన్ మండిపడ్డారు. ‘నేను ఇప్పటికీ హెచ్.సీ.ఏ అధ్యక్షుడిని అని.. అపెక్స్ కౌన్సిల్ కు తాత్కాలిక అధ్యక్షుడిని నియమించే హక్కు లేదని ' స్పష్టం చేశారు. హెచ్.సీ.ఏ చరిత్రలో తాత్కాలిక అధ్యక్షుడు లేరు అని అజార్ స్పష్టం చేశారు.
తనను తొలగించి తాత్కాలిక అధ్యక్షుడిని ఎంపిక చేసిన వైనంపై కోర్టును ఆశ్రయించారు. ''చట్టపరంగా ఎంపికయ్యాను.. సుప్రీంకోర్టు ఆదేశాల మరకు దేశానికి టెస్ట్ క్రికెట్ ఆడిన తాను హెచ్.సీ.ఏ అధ్యక్షుడిగా అర్హుడిని. అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలు చెల్లవు'' అని అజార్ వాదిస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్ లోని ఐదుగురు సభ్యులు హైదరాబాద్ క్రికెట్ లో మొత్తం వివాదానికి కారణం అని అజార్ ఆరోపించారు. ఏసీబీ కేసుల్లో ఇరుకున్న వారు ప్రతిరోజు కోర్టుకు వెళతారని.. వారు నా సమగ్రతను ప్రశ్నించడం ఆశ్చర్యంగా ఉందని అజార్ అన్నారు. ఇక తనను తొలగించి తాత్కాలిక అధ్యక్షుడిని ఎంపిక చేసిన వైనంపై కోర్టును ఆశ్రయించాలని అజారుద్దీన్ ఆలోచిస్తున్నాడు. చట్టపరంగా ఎంపికయ్యాను.. సుప్రీంకోర్టు ఆదేశాల మరకు దేశానికి టెస్ట్ క్రికెట్ ఆడిన తాను హెచ్.సీ.ఏ అధ్యక్షుడిగా అర్హుడిని. అపెక్స్ కౌన్సిల్ ఆదేశాలు చెల్లవు అని అజార్ స్పష్టం చేశారు.
హెచ్.సీ.ఏ రాజకీయ వ్యవహారాల్లో రాజకీయ నాయకుల ప్రమేయం గురించి అడిగినప్పుడు అలాంటిదేమీ జరగడం లేదని అజార్ పేర్కొన్నారు. ఈ సీజన్ కు ముందే హెచ్.సీ.ఏలో వివాదాస్పద అభివృద్ధి గురించి క్రికెటర్లు ఆందోళన చెందుతున్నారు. ఈ వివాదం ఎటు మలుపు తిరుగుతుందో.? చూడాలి మరీ.