అందుకే అనేది డ్రిపెషన్ మహా చెడ్డదని. ఓటమిని జీర్ణించుకోవటం కూడా ఆర్టే. ఆ విషయంలో తానెంత పూర్ అన్న విషయాన్ని టీడీపీ అధినేత చంద్రబాబు తరచూ తన మాటలతో అర్థమయ్యేలా చేస్తుంటారు. సార్వత్రిక ఎన్నికల్లో దారుణమైన ఓటమిని సొంతం చేసుకున్న వేళ.. కాస్తంత గ్యాప్ ఇవ్వాలన్న కనీస ఆలోచన చేసేందుకు బాబు ఇష్టపడలేదు. ఓటుతో ప్రజలు ఛీ కొట్టిన వేళ.. తనను ఎందుకంతగా వ్యతిరేకించారు? తానేం చేశాను? ప్రజలు ఎలా రిసీవ్ చేసుకున్నారు?
తనలో లేనిదేమిటి? జగన్ లో ఉన్నదేమిటి? ఇలాంటి ప్రశ్నలకు అన్ని కోణాల్లో సమాధానాలు వెతకటం.. తాను వెతికిన సమాధానాలు ప్రాక్టికల్ గా ఎంతవరకూ నిజమన్న విషయాన్నిక్రాస్ చెక్ చేసుకోవటం లాంటివి చేయకుండా.. ఓడిపోయిన పదో రోజు నుంచే కొత్తగా కొలువు తీరిన ప్రభుత్వాన్ని అదే పనిగా తిట్టేందుకు బాబు ప్రదర్శించే ఉత్సాహం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.
కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం పాలనా పరంగా కుదురుకొని.. నిర్ణయాలు తీసుకొని.. ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చిన తర్వాత రియాక్ట్ అయితే అంతో ఇంతో ప్రయోజనం. అలాంటిదేమీ లేకుండానే అదే పనిగా తిరుగుతూ.. అనునిత్యం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని తిట్టటం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్న చిన్న విషయాన్ని బాబు గుర్తించటం లేదని చెప్పాలి.
ఏపీ రాజధాని అమరావతి మీద ఇప్పటివరకూ తన వైఖరిని సీఎం జగన్ స్పష్టం చేయలేదు. ఇలాంటప్పుడు తొందరపడి ఒక మాట అనేసే బదులు.. కాస్త ఓపిక పట్టటం చాలా అవసరం. అమరావతిని ఏపీ రాజధానిగా డిసైడ్ చేసే విషయంలో.. చంద్రబాబు అఖిలపక్షాన్ని కానీ.. ప్రజల ఆలోచనల్ని కానీ పరిగణలోకి తీసుకోలేదన్నది వాస్తవం. రాజధాని ఎంపిక పూర్తిగా ఆయన ఆలోచనలకు తగ్గట్లు చేశారన్న విషయాన్ని మర్చిపోకూడదు.
అమరావతిని బాబు ఎంతగా ప్రేమించారో.. అంతే ఎక్కువగా వ్యతిరేకతను మూటగట్టుకున్నారన్నది వాస్తవం. అమరావతిని ఏపీ రాజధానిగా ప్రకటించటంపై అటు ఉత్తరాంధ్రకు చెందిన వారు.. ఇటు రాయలసీమకు చెందిన వారు ఏ మాత్రం సంతోషంగా లేరన్న విషయాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటివేళ.. ఆచితూచి నిర్ణయాన్ని తీసుకోవాల్సి ఉంది. ఇప్పుడు అదే పని చేస్తున్నారు జగన్.
అయితే.. రాజధాని అమరావతి మీద తానేమనుకుంటున్న విషయాన్ని బయటపెట్టని జగన్ తీరుతో బాబు ఆగమాగం అవుతున్నారు. అవసరం ఉన్నా లేకున్నా అదే పనిగా తప్పు పడుతున్నారు. రాజధాని అమరావతిని మారుస్తూ జగన్ నిర్ణయం తీసుకున్న తర్వాత చేయాల్సిన విమర్శల్ని.. ఇప్పుడే చంద్రబాబు చేసేయటం ఆయనకు మాత్రమే చెల్లుబాటు అవుతుందేమో. తాజాగా అమరావతి మీద కొన్ని వ్యాఖ్యలు చేస్తూ.. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తీరును తప్పు పట్టే ప్రయత్నం చేశారు.
జగన్ ను విమర్శించేందుకు ఆయన తండ్రి వైఎస్ ను పొగిడే పని పెట్టుకున్నారు. వైఎస్ బతికున్నప్పుడు ఆయన ముఖం చూసేందుకు సైతం ఇష్టపడని చంద్రబాబు.. ఇప్పుడు వైఎస్ ను గుర్తు చేస్తూ.. ఆయనలోని మంచిని ప్రస్తావిస్తుననారు. మరి.. ఇదే మంచితనం అప్పట్లో బాబుకు ఎందుకు కనిపించలేదన్నది ప్రశ్న.
మంచి నగరాన్ని నిర్మించాలనే ప్రయత్నాన్ని జగన్ చంపేస్తున్నారి ఆరోపిస్తూ.. తన మార్క్ లేకుండా ఉండేందుకు అమరావతిని లేకుండా చేయాలని చూస్తున్నట్లుగా తప్పు పట్టారు. ఇలాంటి తొందరపాటు వ్యాఖ్యలు బాబు ఇమేజ్ ను డ్యామేజ్ చేయటం ఖాయం. అమరావతి మీద తన స్టాండ్ ఫలానా అని జగన్ నోటి నుంచి వచ్చిన తర్వాత బాబు ఎంతన్నా.. ఎన్ని మాటలు చెప్పినా జనం వింటారు.
అందుకు భిన్నంగా ఆయన నోటి నుంచి అమరావతిని మారుస్తున్నట్లుగా పల్లెత్తు మాట రాక ముందే.. జగన్ మీద విరుచుకుపడటానికి మించిన తప్ప మరొకటి ఉండదు. దీనికి తగ్గట్లే.. ఆ రోజు వైఎస్ అలా చేస్తే హైదరాబాద్ ఉండేదా? అంటూ క్వశ్చన్ చేశారు. నిజానికి వైఎస్ ప్రస్తావన అవసరం లేదు. కానీ.. తీసుకురావటం ద్వారా జగన్ ఏదో దుర్గార్మానికి పాల్పడుతున్న భావన కలిగేలా బాబు మాటలు ఉండటాన్ని ప్రజలు హర్షించరు. ఆ విషయం బాబుకు ఎప్పటికి అర్థమవుతుందో?