వారు దేశాన్ని ఏలుతున్న కేంద్రమంత్రులు.. ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. పోలీసులు, గన్ మెన్లు, భద్రత ఉంటుంది. కానీ ఏం లాభం.. దొంగలకు అవేవీ అడ్డురాలేదు. అంతమందిలో ఉన్నా కేంద్రమంత్రులను దొంగలు బురిడీ కొట్టించారు. ఇద్దరు కేంద్రమంత్రులు - వారీ సెక్రెటరీలు అయిన ఐఏఎస్ అధికారులను బోల్తాకొట్టించిన వైనం ఇప్పుడు కేంద్రమంత్రుల పరువు తీసిపారేసింది.
తాజాగా కేంద్రమాజీ మంత్రి - బీజేపీ సీనియర్ నాయకుడు అరుణ్ జైట్లీ అంత్యక్రియల సందర్భంగా దొంగల చేతివాటానికి కేంద్రమంత్రులు - అధికారులు బలయ్యారు. ప్రధాని నరేంద్రమోడీ విదేశీ పర్యటనలో ఉండడంతో కేంద్రమంత్రులు సోమ్ ప్రకాష్- బాబుల్ సుప్రియో - సుప్రియో సెక్రెటరీ - మరో ఇద్దరు అధికారులు జైట్లీ అంత్యక్రియలను క్షేత్రస్థాయిలో ఉండి పర్యవేక్షిస్తున్నారు.
అయితే జైట్లీ అంత్యక్రియలకు దేశవ్యాప్తంగా బీజేపీ శ్రేణులు - నాయకులు తరలిరావడంతో కిక్కిరిసిపోయింది. ఈ గుంపులోనే ఉన్న కేంద్రమంత్రులు సుప్రియో - సోమ్ ప్రకాష్ ఫోన్లను నిగమ్ బోధ్ ఘాట్ వద్ద దొంగలు తెలివిగా కొట్టేశారు. సుప్రియో సెక్రెటరీ మరో ఇద్దరు ఐఏఎస్ ల ఖరీదైన ఫోన్లు కూడా దొంగలు కొట్టేశారు. వీరు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది.
అయితే జైట్లీ అంత్యక్రియల ప్రాంగణంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో దొంగలను కనుక్కొని ఫోన్లను రికవరీ చేయడం పోలీసులకు తలకుమించిన భారమైంది. ఫోన్లను ట్రేస్ చేసే పనిలో పోలీసులు ఉన్నారు. అయితే కేంద్రమంత్రుల ఫోన్లనే కొట్టేస్తే దేశంలో సామన్య ప్రజలకు రక్షణ ఏదీ అని ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఈ వ్యవహారం ఆ కేంద్రమంత్రుల పరువు పోయేలా కనిపిస్తోంది.