జయప్రద పై దారుణ కామెంట్స్.. కోర్టు కేసు తేలేది నేడే

Update: 2021-11-09 10:35 GMT
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని మొరాదాబాద్ లో ప్రత్యేక కోర్టులో ఈరోజు మాజీ ఎంపీ జయప్రదపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన కేసు విచారణకు రానుంది. ఈ కేసులో అజాంఖాన్, అతడి కొడుకు అబ్దుల్లా అజంఖాన్ సహా చాలా మంది నిందితులపై అభియోగాలు నమోదు చేయనున్నారు. అజంఖాన్ తోపాటు పలువురు ఎస్పీ నేతలు ఇందులో నిందితులుగా ఉన్నారు.

ఈ కేసులో కోర్టుకు హాజరుకాకపోవడంతో రాంపూర్ మున్సిపల్ మాజీ అధ్యక్షుడు అజరుఖాన్ ను కోర్టు పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించింది. మిగిలిన నిందితులు బెయిల్ పై విడుదలయ్యారు. నిందితుల ఛార్జ్ షీట్ ను ప్రశ్నిస్తూ కోర్టులో ఇచ్చిన డిశ్చార్జ్ దరఖాస్తును కూడా కోర్టు తిరస్కరించింది. ఇప్పుడు ఈ కేసులో అభియోగాలను రూపొందించనున్నారు.

ఈ కేసులో నిందితుడు మొరాదాబాద్ ఎస్పీ ఎంపీ డాక్టర్ ఎస్.టీ హసన్ వాయిస్ నమూనా మ్యాచ్ జరిగింది. ఇలాంటి పరిస్థితుల్లో ఎస్పీ ఎంపీ డాక్టర్ హసన్ కష్టాలు ఇప్పుడు పెరగడం ఖాయం.

ప్రస్తుతం ఈ కేసులో ఇద్దరు నిందితులు అజంఖాన్, అతడి కుమారుడు అబ్దుల్లా అజంఖాన్ సీతాపూర్ జైలులో ఉన్నారు.

రాంపూర్ నుంచి బీజేపీ తరుఫున జయప్రద, సమాజ్ వాదీ నుంచి అజంఖాన్ గత ఎంపీ ఎననికల్లో పోటీచేశారు. ఈ సమయంలోనే జయప్రదను దారుణ కామెంట్స్ చేశాడు అజంఖాన్. ‘ఆమె ఖాకీ అండర్ వేర్ ధరించిందని మాత్రం గుర్తించలేకపోయా’ అంటూ అజాంఖాన్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర వివాదాస్పదమయ్యాయి. ఈసమయంలోనే కేసు నమోదై అజంఖాన్ జైలు పాలయ్యారు.
Tags:    

Similar News