ఆ ఎమ్మెల్యేకు బెదిరింపులు వ‌చ్చాయ‌ట‌!

Update: 2017-09-10 09:08 GMT
2014 శాసనసభ ఎన్నికల్లో వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలు (ఎస్సీ రిజర్వుడ్) నియోజకవర్గం నుంచి గెలిచిన తిరివీధి జయరాములు గుర్తున్నాడా అండీ. ఆ ఎన్నికల్లో వైఎస్ జగన్ ఆధ్వర్యంలోని వైఎస్సార్ సీపీ నుంచి గెలిచి తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రలోభాలకు తలొగ్గి పార్టీ ఫిరాయించి తెలుగుదేశంలో చేరిన సంగతి తెలిసిందే. ఆయన ఇప్పుడు మళ్లీ తెరమీదకొచ్చారు. వైఎస్సార్ సీపీకి చెందిన కొంతమంది వ్యక్తులు సోషల్ మీడియాలో తనను దూషిస్తూ - బెదిరిస్తూ చంపుతామంటున్నారని, వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ప్రతిపక్షనేత - వైఎస్సార్ సీపీ అధినేత జగన్ అభ్యంతరకర పదజాలంతో మాట్లాడుతుంటే తాను స్పందించానని - అసభ్యకరంగా మాట్లాడుతుంటే ఇది సబబు కాదని మాత్రమే చెప్పానని జయరాములు అంటున్నారు. దీనికే ఆ పార్టీకి చెందినవారు తనను చంపుతామంటున్నారని వాపోయారు. వైఎస్సార్ సీపీకి చెందినవారు మాత్రమే దీనిపై వేరే రకంగా స్పందిస్తున్నారు. తెలుగుదేశానికి అమ్ముడుపోయిన జయరాములు పార్టీ మారింది కాకుండా 'నవ్విపోదురు గాక నాకేటి సిగ్గు' అనే రీతిలో వ్యవహరిస్తున్నారని మండిపడుతున్నారు.
Tags:    

Similar News