ఆర్యన్ ఖాన్.. మత్తు దిగుతోందా? నిన్న మొన్నటి వరకు కులాసాగా.. రాకెట్ రాయుడిగా.. జీవితాన్ని ఎంజాయ్ చేసిన.. యువ కుడు.. పట్టుమని పాతికేళ్లు కూడా నిండని.. బాలీవుడ్ దిగ్గజ నటుడు.. షారుక్ ఖాన్ కుమారుడు.. ఆర్యన్ ఇప్పుడు.. జైలు ఊచలు లెక్క పెడుతున్నాడు. డ్రగ్స్ కేసులో అరెస్టైన ఆర్యన్ ఖాన్‌కు ముచ్చటగా మూడో సారి కోర్టులో బెయిల్ పిటిషన్ తిరస్కరణకు గురైంది. నార్కొటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సీబీ) బుధవారం స్టేట్‌మెంట్ ఇచ్చిన తర్వాత ఆర్యన్ బెయిల్ పిటిషన్‌పై అదే రోజు విచారణ జరుగనుంది. శుక్రవారం వరకు ఆర్యన్‌ను తమ కస్టడీలోనే ఉంచాలని ఎన్‌సీబీ తరఫు న్యాయవాది కోరగా.. న్యాయమూర్తి దానిని తిరస్కరించి బుధవారం ఉదయానికి స్టేట్‌మెంట్ సమర్పించాలని ఆదేశించారు.
మరోవైపు ఆర్యన్ తరఫు న్యాయవాది ఈ రోజు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరగాలని కోరారు. అతని వద్ద ఎలాంటి మాదక ద్రవ్యాలు లభించలేదు కాబట్టి.. ఇంతకాలం విచారణ అవసరం లేదన్నారు. ఇరు వైపు వాదనలు విన్న న్యాయమూర్తి బెయిల్ పిటిషన్‌పై విచారణను వాయిదా వేశారు. దీంతో ఆర్యన్ మరో మూడ్రోజులు జైలులోనే ఉండాల్సి ఉంది. క్రూజ్ నౌక డ్రగ్స్ కేసు వ్యవహారంలో ఆర్యన్ గతవారంం రోజులుగా ముంబయి జైల్లో ఉంటున్నాడు. ఆర్యన్ ఖాన్, మరో ఏడుగురు గత వారం ముంబై నుండి గోవాకు ప్రయాణిస్తున్న ‘కార్డెలియా’ అనే క్రూయిజ్ షిప్‌లో డ్రగ్స్ తో పట్టుబడ్డారు. అండర్ కవర్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్‌సిబి) దాడుల్లో 13 గ్రాముల కొకైన్, 21 గ్రాముల హషిష్, 22 మాత్రలు ఎండిఎమ్ఎ, 5 గ్రాముల ఎండిని స్వాధీనం చేసుకున్నారు.
ఇదిలావుంటే, కుమారుడి ఎఫెక్ట్ తండ్రిపైనా పడింది. బైజూస్ ఎడ్యూ టెక్ మేజర్ తమ సర్వీసుల అడ్వైర్టైజింగ్ లో కనిపించే షారుఖ్ ఖాన్ ను తప్పించింది. అతని కొడుకు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఇలా వ్యవహరించినట్లు స్పష్టం చేసింది. కొద్ది రోజులుగా ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా అకౌంట్లో కంపెనీపై విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో అడ్వాన్స్ బుకింగ్స్ అన్నింటినీ ఆపేశాయి. షారుఖ్ ఖాన్ అతిపెద్ద స్పాన్సర్ షిప్ ఒప్పందాలలో ఒకటి బైజూస్. హ్యూండాయ్, ఎల్జీ, దుబాయ్ టూరిజం, ఐసీఐసీఐ, రిలయన్స్ జియో వంటి అనేక కంపెనీలతో కూడా షారుఖ్ ఒప్పందం కుదుర్చుకున్నాడు. బైజూస్ ఈ నిర్ణయం తీసుకోవడానికి ఆర్యన్ ఖాన్ పై ఆరోపణలే కారణమని తెలుస్తోంది. బైజు విలువ ఏప్రిల్‌లో 16.5 బిలియన్ డాలర్లుగా ఉంది.