ట్రిపుల్ డెత్ కేసులో కీలక పరిణామం.. తెరపైకి సెల్ ఫోన్లు, చెరువు నీరు!
ఎస్సై, మహిళా కానిస్టేబుల్, ఓ యువకుడు నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందిన కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే.
అడ్లూర్ ఎల్లారెడ్డి చెరువులో ముగ్గురు మృతి చెందిన కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... ఈ కేసులో ఎస్సై సాయికుమార్, కానిస్టేబుల్ శృతి, యువకుడు నిఖిల్.. ముగ్గురూ నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందినట్లు పోస్టుమార్టం ప్రాథమిక నివేదికలో వైద్యులు తేల్చారు. ఈ నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది.
అవును... ఎస్సై, మహిళా కానిస్టేబుల్, ఓ యువకుడు నీటిలో మునిగి ఊపిరాడక మృతి చెందిన కేసు తీవ్ర సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ముగ్గురి సెల్ ఫోన్ లను అన్ లాక్ చేయడం, వాటిలో ఏదైనా సమాచారం నిక్షిప్తమై ఉందా అనే విషయం ఇప్పుడు ఆసక్తిగా మారింది. వీటిని తాజాగా హైదరాబాద్ లోని సాంకేతిక నిపుణుల వద్దకు పంపించారు.
ఇదే సమయంలో... మృతుల ఊపిరితిత్తుల్లో నిండిన నీరు, చెరువులో ఉన్న నీరు ఒక్కటేనా అనేది నిర్ధారించేందుకు.. చెరువుల్లోని నీటి నమూనాలను సేకరించిన పోలీసులు.. హైదరాబాద్ లోని ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపించారు! ఈ నేపథ్యంలో సెల్ ఫోన్, శరీరంలో నీటిపై క్లారిటీ వచ్చిన అనంతరం.. కేసు దర్యాప్తూ కొలిక్కి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు.
ఈ నేపథ్యంలో.. ఒకవేళ పోస్టుమార్టం ప్రాథమిక రిపోర్టుకు ఫోరెన్సిక్ ల్యాబ్ రిపోర్టు భిన్నంగా వస్తే దర్యాప్తు తీరు మారనుందని అంటున్నారు. అందుకే.. పోలీసులు ఈ ఫోరెన్సిక్ నివేదికతో పాటు సెల్ ఫోన్లకు సంబంధించిన నివేదికల కోసం వేచి చూస్తున్నట్లు చెబుతున్నారు.
మరోపక్క.. కేసులో వాస్తవాలను వెలికి తీసేందుకు పోలీసులు వాంగ్మూలాల సేకరణ చేపడూతున్నారని అంటున్నారు. ఇందులో భాగంగా... ఈ కేసుకు సంబంధం ఉన్నట్లూ చెబుతున్న భిక్కనూరు, గాంధారి, బీబీపేట, మెదక్ జిల్లా కొల్చారం ప్రాంతాలతో సంబంధాలు ఉండటంతో పోలీసులు ఆయా ప్రాంతాలపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.
ఇందులో భాగంగా... మృతుల బంధువులు, స్నేహితులు, స్థానికుల నుంచి సమాచారం సేకరిస్తున్నట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో ఫోరెన్సిక్ ల్యాబ్, సెల్ ఫోన్స్ లో ఏముందనే విషయాలు ఇప్పుడు కీలకంగా మారాయి!