తుపాకీ టీమ్ : మీ అందరికీ శుభకరమైన జయప్రదమైన నూతన సంవత్సర శుభాకాంక్షలు !
తుపాకీ మూడు అక్షరాల ఈ వెబ్ సైట్ వెబ్ ప్రపంచంలో తనదైన వైబ్రేషన్స్ తో దూసుకుపోతూ ముందుకు విజయవంతంగా సాగిపోతున్న సంగతి మీ అందరికీ తెలుసు.
తుపాకీ మూడు అక్షరాల ఈ వెబ్ సైట్ వెబ్ ప్రపంచంలో తనదైన వైబ్రేషన్స్ తో దూసుకుపోతూ ముందుకు విజయవంతంగా సాగిపోతున్న సంగతి మీ అందరికీ తెలుసు. తుపాకీ గురికి తిరుగు లేదు, అదే మాదిరిగా
తుపాకీ వెబ్ సైట్ లో వార్తలు కూడా అంతే పదునుగా ఉంటాయన్న సంగతి తెలిసిందే. తుపాకీ ఎవరి పక్షం వహించదు. పక్ష పాతం అంత కంటే లేదు అన్నది కూడా మా ఉత్తమమైన ట్రాక్ రికార్డు చూస్తే అందరికీ అర్ధం అవుతుంది.
మేము ప్రజా పక్షంగా ఉంటూ ఎప్పటికపుడు వాస్తవాలను అద్దం పడుతూ ఎంతో వేగంగా జనాలకు చేరువ చేయడంలో అహరహం పరిశ్రమిస్తున్నాం. తటస్థత మా నైజం. నిజం మా వాదం పారదర్శకత మా విధానం. ఈ మూడు సూత్రాలనే మంత్రాలుగా చేసుకుని తుపాకీ వెబ్ సైట్ దినదినాభివృద్ధి చెందుతూ ఈ రోజుకి ఈ స్థాయికి చేరుకుంది.
ముగిసిన 2024లో చూసుకుంటే తుపాకీ వెబ్ సైట్ ద్వారా వచ్చిన రాజకీయ వార్తలు విశ్లేషణలు, అభిప్రాయాలు మమ్మల్ని ఎంతగానో అభిమానించే వారందరి మన్ననలు చూరగొన్నాయని భావిస్తున్నాం. ప్రాంతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకూ అలాగే జాతీయ అంతర్జాతీయ స్థాయి వరకూ కాదేదీ వార్తలకు అనర్హం అన్నట్లుగా తుపాకీ చేసిన వార్తా విహారం అశేష విశేష అభిమాన గణాన్ని 2024 లో సంపాదించుకుంది అని చెప్పడానికి ఎలాంటి సందేహం లేదని గట్టిగా చెప్పగలం.
అంతే కాదు సినీ రంగానికి సంబంధించిన వార్తలు కానీ సమీక్షలు కానీ ఉన్నది ఉన్నట్లుగా అందించడం ద్వారా ప్రేక్షకాభిమానాన్ని అందుకున్నాం. ఈ విషయంలో ఎటువంటి వివాదాలకు తావు లేకుండా ఇచ్చే సినిమా రివ్యూలు ఎపుడూ మన్ననలు అందుకుంటూనే ఉన్నాయి.
సినిమా రంగం రాజకీయ రంగం ఈ రెండూ అశేషమైన ప్రజలతో కూడుకున్నవి. వెండి తెర కథానాయకులతో పాటు రాజకీయ నాయకులు కూడా జన హృదయాలకు ఎపుడూ దగ్గరగా ఉంటారు. అటువంటి వారికి సంబంధించి వార్తలు అందించే విషయంలో తుపాకీ వెబ్ సైట్ ఎపుడూ హద్దు మీరలేదు, గీత దాటలేదు అని బలంగా చెప్పగలదు తుపాకీ టీమ్.
క్రీడలకు సంబంధించిన అంశాలే కాకుండా కరెంట్ అఫైర్స్ క్షణక్షణం మారుతున్న పరిణామాలను అన్నింటికీ క్రోడీకరించి వాస్తవాలను రియల్ టైమ్ లో జన బాహుళ్యంలోకి తీసుకుని రావడంలో తుపాకీ టీమ్ పోషిస్తున్న పాత్ర మీ అభిమానపాత్రమైందని చెప్పగలం.
ఇక చూసుకుంటే 2024 ఏడాదిలో దేశవ్యాప్తంగా లోక్ సభ ఎన్నికలు జరిగాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ లో శాసన సభ ఎన్నికలు జరిగాయి. ఎంతో ఉత్కంఠగా సాగిన ఈ ఎన్నికలలో ఫలితలు ఎలా ఉంటాయో ముందే ఆలోచించి రాసిన విశ్లేషణలు కూడా తుపాకీ వెబ్ సైట్ గురి తప్పలేదని అనంతర ఫలితాలు నిరూపించాయి. జనాల ఆశలు ఆకాంక్షలు ఎప్పటికపుడు తెలుసుకుంటూ వాటికి అనుగుణంగా వార్తలు మలచడంలో మేము చేస్తున్న కృషి గడచిన ఏడాదిలో మీ ఆదరణ పొందిందని మనసారా భావిస్తున్నాం.
వెబ్ సైట్లలో ఉత్తమ ప్రమాణాలు నెలకొల్పుతూ మేము గీసుకున్న గీతను దాటకుండా ఎవరి మనసు నొప్పించకుండా ఏ వర్గం మనోభావాలు దెబ్బతినకుండా అందరి క్షేమం సంక్షేమం అన్నదే మా లక్ష్యంగా చేసుకుని సాగిస్తున్న ఈ అక్షర యాగానికి మీ నుంచి అంతే స్థాయిలో దక్కుతున్న ప్రేమాభిమానాలకు తుపాకీ టీమ్ సదా ధన్యవాదాలు తెలుపుకుంటోంది.
ఇదే స్పూర్తితో ఇదే ఒరవడితో ఇదే దూకుడుతో తుపాకీ టీమ్ 2025ని ఘనంగా స్వాగతిస్తోంది. ఈ కొత్త ఏడాదిలో కూడా ఎక్కడా మీ నమ్మకాన్ని అభిమానాన్ని కించిత్తు కూడా పోగోట్టుకుండా మరింతగా రెట్టించిన ఉత్సాహంతో ఇంతకు మరింతలుగా పనిచేసేందుకు సరికొత్త ఉత్సాహంతో మేము సిద్ధమని వినయంగా తెలియచేసుకుంటున్నాం.
తుపాకీ వెబ్ సైట్ ని ఆదరిస్తూ మీ అభిమానాన్ని నిండుగా కురిపిస్తూ ఎప్పటికప్పుడు మా వెన్నంటి నిలుస్తున్న మీ అందరికీ కొత్త ఏడాది 2025 ఎన్నో విజయాలు అందించాలని మనసారా కోరుకుంటున్నాం. మీరు మేము మాతో మీరు ఇలా అందరం కలసి ఉత్తమ సమాజ నిర్మాణం కోసం పనిచేయాలని కోరుకుంటున్నాం.
తుపాకీ అంటే రాజకీయం వినోదం మత్రమే కాదు విజ్ఞానం సందేశం ఇత్యాది అంశాల కలగలుపుగా సమాజానికి మంచి మేలుకొలుపుగా ఉంటుందని తెలియచేస్తున్నాం. రానున్న 365 ఏక దీక్షతో పనిచేస్తూ అనుకున్న లక్ష్యాలను కొత్త ఏడాదిలో నూరు శాతం సాధించడానికి కంకణబద్ధురాలు అవుతుందని మాట ఇస్తూ మనవి చేస్తూ మరొక్కసారి మీ అందరికీ నూతన సంవత్సర శుభాకాక్షలు తెలియచేస్తూ.... మీ తుపాకీ టీమ్