స్విగ్గీలో రికార్డ్‌ స్థాయి కండోమ్‌ ఆర్డర్స్‌

ముఖ్యంగా రాత్రి సమయంలో స్విగ్గీ డెలవరీ యాప్‌ ద్వారా 3.5 లక్షల స్నాక్స్‌ ఆడర్స్‌ను చేసినట్లుగా పేర్కొన్నారు. మధ్యం తాగుతూ చాలా మంది స్విగ్గీ ద్వారా స్నాక్స్‌ను ఆర్డర్‌ పెట్టుకున్నారు.

Update: 2025-01-01 09:52 GMT

ఆన్‌లైన్ ఫుడ్‌ డెలివరీ సంస్థ స్విగ్గీ గత కొంత కాలంగా గ్రాసరీ డెలివరీ సర్వీస్‌ని అందిస్తున్న విషయం తెల్సిందే. పండుగలు, ప్రత్యేక రోజుల్లో స్విగ్గీ ఫుడ్ డెలివరీతో పాటు గ్రాసరీ బుకింగ్స్ సైతం భారీ ఎత్తున ఉంటున్నాయి. పలు గ్రాసరీ డెలివరీ యాప్స్ ఉన్నా అత్యధికంగా స్విగ్గీని ఆశ్రయిస్తారు. డిసెంబర్‌ 31 సాయంత్రం మొదలుకుని అర్థరాత్రి దాటిన తర్వాత పెద్ద ఎత్తున ఫుడ్‌ డెలివరీతో పాటు గ్రాసరీ ఆర్డర్‌లను స్విగ్గీ అందుకున్నట్లుగా సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. ముఖ్యంగా రాత్రి సమయంలో స్విగ్గీ డెలవరీ యాప్‌ ద్వారా 3.5 లక్షల స్నాక్స్‌ ఆడర్స్‌ను చేసినట్లుగా పేర్కొన్నారు. మధ్యం తాగుతూ చాలా మంది స్విగ్గీ ద్వారా స్నాక్స్‌ను ఆర్డర్‌ పెట్టుకున్నారు.

రాత్రి పార్టీకి కావాల్సిన పలు రకాల వస్తువులను అర్థరాత్రి వరకు స్విగ్గీ ద్వారా ఆర్డర్‌ పెట్టుకుని తెప్పించుకున్న వారు ఉన్నారు. ఇక డిసెంబర్‌ 31న సాయంత్రం 5 గంటల 30 నిమిషాల వరకు దాదాపుగా 4800 కండోమ్‌ ప్యాకెట్స్‌ను డెలివరీ కోసం ఆర్డర్‌ పెట్టారు. రాత్రి సమయంకు ఈ సంఖ్య భారీగా పెరిగినట్లుగా సంస్థ నిర్వాహకులు పేర్కొన్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా పార్టీలు చేసుకున్న వారు పెద్ద మొత్తంలో ఫుడ్‌ను ఆర్డర్‌ పెట్టడంతో పాటు మందు పార్టీలో ఉన్న వారు స్నాక్స్‌ను ఆర్డర్‌ పెట్టుకోవడం జరిగింది. అదే సమయంలో రికార్డ్‌ స్థాయిలో కండోమ్స్ సైతం ఆన్‌ లైన్‌ ద్వారా ఆర్డర్‌ పెట్టుకుని తెప్పించుకోవడం చర్చనీయాంశంగా మారింది.

తెలుగు రాష్ట్రాల్లో ప్రతి రోజు కంటే ఎక్కువ సమయం మధ్యం అమ్మకాలు సాగాయి. హైదరాబాద్‌లో మద్యం డోర్‌ డెలివరీ చేసే పద్దతి ఉంటే మరింతగా అమ్మకాలు ఉండే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వందల కోట్ల మద్యంను తెలంగాణలో తాగుబోతులు తాగేశారు. గత మూడు రోజుల లెక్క తీస్తే అత్యధికంగా 1500 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయని అంటున్నారు. ఇది కచ్చితంగా ఆల్‌ టైమ్‌ రికార్డ్‌గా నమోదు చేసుకోవచ్చు. అయితే ఈ రికార్డ్‌ ప్రతి సంవత్సరం సంవత్సరం మారుతూనే ఉంది. ప్రత్యేక రోజుల్లో ఈ అమ్మకాలు విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.

హైదరాబాద్‌ వంటి మెట్రో నగరాల్లో ప్రతి వస్తువును ఇంటికి తీసుకు వచ్చి డెలివరీ ఇచ్చే విధానం ఉండటంతో ప్రతి ఒక్కటి ఇంట్లేనే కూర్చుని డెలివరీ కోసం ఆర్డర్స్ పెట్టుకుంటున్న వారి సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రతి ఏడాది ఈ డోర్‌ డెలివరీ యాప్స్‌ను ఆశ్రయిస్తున్న వారి సంఖ్య అమాంతం పెరుగుతూ ఉంది. అందుకే పలు కంపెనీలు డెలివరీ కోసం పుట్టుకు వస్తున్నాయి. వచ్చే ఏడాది వరకు ఈ డోర్‌ డెలివరీ యాప్స్ మరింతగా పెరగడం మాత్రమే కాకుండా మరిన్ని సర్వీసులు వారు అందిస్తారేమో చూడాలి.

Tags:    

Similar News