వైరల్ : యూపీ వరుడి బరాత్‌లో రష్యన్ సెక్సీ డాన్సర్‌లు
విదేశీ స్టార్ ఆర్టిస్టులను రప్పించి ప్రత్యేక షోలు ఇప్పించారు. అంతే కాకుండా వందల కొద్ది వంటలను అతిధులకు వడ్డించిన విషయం తెల్సిందే.
ఇండియాలో పెళ్లిలకు ఖర్చు భారీగా పెరుగుతోంది. ఒకప్పుడు కోటి రూపాయలు పెట్టి పెళ్లి చేసుకుంటే గొప్ప అనే అభిప్రాయం ఉండేది. కానీ ఇప్పుడు వందల కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేసుకుంటున్న వారు ఉన్నారు. ఆ మధ్య అంబానీ తన కొడుకు అనంత్ అంబానీ పెళ్లిని అత్యంత భారీగా ఖర్చు చేసి జరిపిన విషయం తెల్సిందే. అనంత్ అంబానీ పెళ్లికి అంబానీ ఫ్యామిలీ వేల కోట్లను ఖర్చు చేసింది అనేది టాక్. ఆ మొత్తం ఎంత అనేది క్లారిటీ లేదు కానీ ఇండియాలో అత్యధికంగా ఖర్చు చేసిన పెళ్లిగా అంబానీ వారి ఇంటి పెళ్లి నిలిచింది.
విదేశీ స్టార్ ఆర్టిస్టులను రప్పించి ప్రత్యేక షోలు ఇప్పించారు. అంతే కాకుండా వందల కొద్ది వంటలను అతిధులకు వడ్డించిన విషయం తెల్సిందే. కోట్లాది రూపాయలతో అద్భుతమైన డెకరేషన్‌లు చేయించారు. అంత స్థాయిలో కాకున్నా తాజాగా యూపీలో ఒక వ్యాపారవేత్త తన కొడుకు అక్షిత్ వివాహంను వైభవంగా చేయాలనే ఉద్దేశ్యంతో వధువు ఇంటికి ఊరేగింపుగా తీసుకు వెళ్లాడు. పెళ్లికి తరలి వెళ్తున్న వరుడు రష్యన్ ముద్దుగుమ్మల డాన్స్‌లతో ముందుకు కదిలాడు. దాదాపుగా 20 మంది రష్యన్ సెక్సీ ముద్దుగుమ్మలు ఈ బరాత్‌లో పాల్గొన్నారు.
రోడ్డు మీద రష్యన్ ముద్దుగుమ్మలు హొయలు పోతూ చేసిన డాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఈ వీడియోలకు ఎవరికి వారు ఇష్టానుసారంగా కామెంట్స్ చేస్తున్నారు. పెళ్లి అనే అర్థంను ఇండియన్స్ మార్చేస్తున్నారు. ఇలాంటి పద్దతులు ఇండియన్ సాంప్రదాయాలకు దూరంగా ఉండాలని అనుకుంటే, అవే ఇప్పుడు ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయని కొందరు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటివి హిందూ సాంప్రదాయాల్లో ఉండవు. కానీ మీరు ఎందుకు ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తున్నారు అంటూ కొందరు తీవ్ర స్థాయిలో విమర్శలు చేస్తూ వీడియోపై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
అత్యంత ఖర్చు పెట్టి రష్యన్ ముద్దుగుమ్మలను ఈ బరాత్‌కి తీసుకురావాల్సిన అవసరం ఏముంది అంటూ కొందరు ఈ విషయమై వివాహ నిర్వాహకులను ప్రశ్నిస్తూ ఉంటే కొందరు మాత్రం వారికి మద్దతుగా నిలుస్తున్నారు. ఇలాంటి బరాత్‌తో పెళ్లికి వచ్చిన వరుడిని వధువు తండ్రి వెనక్కి పంపించాలని, తమ అమ్మాయిని ఇలాంటి ఇంటికి పంపించాల్సిన అవసరం ఉందా అని ఆలోచించాల్సిన అవసరం ఉంది అంటూ కొందరు కామెంట్స్ చేశారు. మొత్తానికి ఈ పెళ్ళి భరాత్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.