బాస్ కాని బాస్ అయినప్పటికీ చిన్న మాట తేడా వస్తే ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందో తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష నేత రేవంత్ రెడ్డికి బాగానే అర్థమై ఉంటుంది. ఊహించని విధంగా ఆయనకు కాసింత ఇబ్బందికర పరిస్థితి ఎదురైందని చెప్పక తప్పదు. తాను నటించిన వందో సినిమా అయిన గౌతమీ పుత్ర శాతకర్ణి చిత్రానికి సంబంధించిన స్పెషల్ షోకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆహ్వానించేందుకు బాలకృష్ణ తెలంగాణ అసెంబ్లీకి వెళ్లారు.
బాలయ్య వస్తున్న సమాచారాన్ని అందుకున్న తెలంగాణ తెలుగుదేశం నేతలు.. టీఆర్ ఎస్ పక్ష నేతలు ఆయనకు స్వాగతం పలికారు. కారు దిగిన ఆయనకు.. రేవంత్ రెడ్డి ఎదురెళ్లి పసుపు రంగు గులాబీల బొకేను అందించారు. ఈ సందర్భంగా ఆయన.. ‘వెల్ కం టూ తెలంగాణ అసెంబ్లీ’ అని ఆహ్వానించారు. దీనికి స్పందించిన బాలకృష్ణ.. తాను కళాకారుడినని.. తనకు రాష్ట్రాలతో సంబంధం లేదని.. వేరు చేసి మాట్లాడటం సరికాదంటూ తనదైన ధోరణిలో చెప్పుకొచ్చారు. ఊహించని రీతిలో పంచ్ పడేసరికి రేవంత్ కాస్త ఇబ్బందికి గురి కావాల్సి వచ్చింది.
అదే సమయంలో టీఆర్ ఎస్ నేతలు సైతం బాలకృష్ణకు పింక్ కలర్ గులాబీల బొకే ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పలువురు టీఆర్ ఎస్ ఎమ్మెల్యేలు బాలకృష్ణకు షేక్ హ్యాండ్ ఇవ్వటానికి ఆసక్తిని ప్రదర్శించటం గమనార్హం. అనంతరం ఆయన తెలంగాణ తెలుగుదేశం శాసనసభాపక్ష కార్యాలయానికి వెళ్లారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/