హిందూపురం ఎమ్మెల్యే - సినీ నటుడు బాలకృష్ణకు టీడీపీలో బ్రహ్మాండమైన ఇమేజి ఉంది. ఆయనకు తెలుగు సినీ అభిమానుల్లో ఎలాంటి ఇమేజి ఉందో పార్టీలోనూ అదేరకమైన ఇమేజి ఉంది. తాను అనుకున్న పని సాధించడంలో ఎవరు అడ్డొచ్చినా ఖబడ్దార్ అంటారని అప్పుడే టీడీపీలో టాక్ వచ్చేసింది. బాలయ్య దెబ్బకు టీడీపీయే కాదు బీజేపీ నేతలూ జాగ్రత్త పడుతున్నారు.
అన్నగారు ఎన్టీఆర్ తనయుడిగా - సీఎం చంద్రబాబుకు వియ్యంకుడిగా - బావమరిదిగా... లోకేశ్ కు మామగారిగా పార్టీలో బాలయ్య అమిత ప్రాధాన్యం దక్కుతోంది. అందుకు తగ్గట్లుగానే ఆయన కూడా ప్రజా సమస్యల పరిష్కారంలో ప్రత్యేక చొరవ చూపిస్తున్నారు. రాజకీయంగా అనుభవం తక్కువే అయినా తన నియోజకవర్గంపై ఆయన చూపిస్తున్న శ్రద్ధ మాత్రం తక్కువేమీ కాదు. స్థానిక నాయకులతో మాట్లాడుతూ ఎప్పటికప్పుడు పనులు చేయిస్తూ.. ఆపనుల తీరునూ ఆయన పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో ఎవరైనా ఇబ్బందులు సృష్టించారని అనిపిస్తే చాలు వాయించిపడేస్తున్నారట. దీంతో హిందూపురం ప్రజలు, బాలయ్య అభిమానులు ఆయన్ను అక్కడ హీరోలాగే చూస్తున్నారు. కానీ, అనంతపురం ప్రజాప్రతినిధులు అధికారులు మాత్రం బాలయ్యను చూసి కంగారు పడుతున్నారట.
తాజాగా బాలయ్య కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరికి ముచ్చెమటలు పోయించారు. ఇంతకుముందు కూడా ఉత్తరాంధ్రకు చెందిన ఓ మంత్రికి బాలయ్య తన తడాఖా ఏంటో రుచి చూపించారు. ఇప్పటికే బాలయ్య హీరోయిజం తెలిసినవారు ఆయనకు సరెండరవుతున్నారు. బీజేపీ నేతలు కూడా బాలయ్యకు ప్రత్యేక మర్యాదలు చేస్తున్నారు. ఏదైనా పనికోసం ఆయన వెళ్తే చాలు బీజేపీ మంత్రులు ఎదురెళ్లి ఆహ్వానించి దగ్గరుండి పనిచేసి పంపిస్తున్నారు. ఇది చాలు బాలయ్య రేంజి ఎలా ఉందో తెలియడానికి.
బాలయ్య హిందూపురం నియోజకవర్గం కోసం ఏమైనా చేసేటట్లున్నారు అంటున్నారు టీడీపీ నేతలు. హిందూపురం నియోజకవర్గానికి వెళ్లే వాటర్ పైప్ లైన్ కు కొందరు రంథ్రాలు చేశారని... అందువల్ల నీరు హిందూపురానికి రావడం లేదని బాలయ్యకు ఫిర్యాదు అందిందట. దీంతో ఆయన తన పొరుగు నియోజకవర్గ ఎమ్మెల్యేపై మండిపడ్డారు. బాలకృష్ణ నియోజవకర్గం హిందూపురంలో తాగునీటి కోసం కల్యాణదుర్గం నియోజకవర్గం గుండా పైప్ లైన్లు వేసి తీసుకెళ్తున్నారు. అయితే.. ఇటీవల తరచూ ఆ పైపులకు రంథ్రాలు పడుతున్నాయట. దీని వెనుక కళ్యాణదుర్గం ఎమ్మెల్యే హనుమంతరాయచౌదరి హస్తం ఉందంటూ కొందరు బాలకృష్ణకు చెప్పారట. ఇంకేముంది... బాలయ్యకు కోపం కొండలా పెరిగిపోయింది... నా దగ్గర రాజకీయాలు చేయొద్దు అంటూ హనుమంత చౌదరికి వార్నింగు ఇచ్చారట. ఒక్కసారితో ఆపకుండా ఏ కార్యక్రమంలో ఆయన కనిపించినా బాలయ్య వార్నింగు ఇస్తుండేసరికి పాపం.. చౌదరి బెదిరిపోయి బాలయ్యకు వివరణ ఇచ్చుకున్నారట. పైప్ లైన్ల లీకేజిలకు తనకు సంబందం లేదని... పదేపదే తనను నిందించవద్దని ఆయన బతిమాలుకున్నారట. దీంతో బాలయ్య కోపం తగ్గి సర్లే ఇంకోసారి రిపీట్ కావద్దు.. అంటూ వదిలేశారట. అదీ సంగతి.