బండి సంజ‌య్‌కి మోడీ ద‌గ్గ‌ర మార్కులు లేవా?

Update: 2022-02-08 13:30 GMT
బండి సంజ‌య్‌. తెలంగాణ బీజేపీ చీఫ్ మాత్ర‌మే కాదు.. ఫైర్ బ్రాండ్‌. నేరుగా సీఎం కేసీఆర్‌తోనే త‌ల‌ప‌డే నాయ‌కుడిగా.. మాట‌ల తూటాలు ఎక్కుపెట్టే నేత‌గా కూడా ఆయ‌న పేరు తెచ్చుకున్నారు. విష‌యం ఏదై నా.. కూడా ఆయ‌న దూకుడు స్ట‌యిల్ డిఫ‌రెంట్‌. ఎంపీగానే కాకుండా.. పార్టీ అధ్య‌క్షుడిగా ఆయ‌న త‌క్కువ కాలంలోనే గుర్తింపు పొందారు. దీనికి మొత్తానికీ.. కార‌ణం.. ఆయ‌న దూకుడే. కేవ‌లం రాష్ట్రంలోనే కాకుండా.. జాతీయ‌స్థాయి బీజేపీ నేత‌ల వ‌ద్ద కూడా బండి పేరు తెచ్చుకున్నారు. దూకుడు మీదున్న‌వు బిడ్డా.. ! అంటూ.. అంద‌రూ ఆయ‌న‌ను ప్ర‌శంసిస్తున్నారు.

ఇక‌, ఇటీవ‌ల జాగ‌ర‌ణ దీక్ష పేరుతో బండి హ‌డావుడి చేసిన విష‌యం తెలిసిందే. అయితే.. ఇదివివాదం కావ‌డం.. పోలీసులు ఆయ‌న ఇంటికి వెళ్లి మ‌రీ.. లోప‌ల ఉన్న బండినిబ‌య‌ట‌కు తెచ్చి అరెస్టు చేయ‌డం.. జైలుకు పంపించ‌డం సంచ‌ల‌నంగా మారాయి. ఈ క్ర‌మంలో బీజేపీ జాతీయ‌పెద్ద‌ల నుంచి కొంద‌రు బీజ‌పీ పాలిత సీఎంలు కూడా హుటాహుటిన హైద‌రాబాద్‌కు వ‌చ్చి.. బండిని ప‌రామ‌ర్శించారు. మ‌ధ్య ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి శివ‌రాజ్ సింగ్ చౌహాన్‌.. అసో సీఎం స‌హా.. బీజేపీ జాతీయ అధ్య‌క్షుడు న‌డ్డా కూడా వ‌చ్చి.. బండికి సంఘీభావంతెలిపారు.

ఈ క్ర‌మంలోనే కేసీఆర్ ప్ర‌భుత్వంపై వారు తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు. దీంతో బండికి ఇక్క‌డే కాదు.. జాతీయ‌స్థాయిలో నూ మంచి ఫేమ్‌, పేరు ఉన్నాయ‌నే టాక్ వినిపించింది. క‌ట్ చేస్తే.. తాజాగా ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర‌మోడీ హైద‌రాబాద్ వ‌చ్చారు. ఇది అధికారిక ప‌ర్య‌ట‌నకాదు. ఇక్రిశాట్ ప‌రోశ‌న‌ధ‌ల కేంద్రం వార్షికోత్స‌వంలో పాల్గొన‌డం వ‌ర‌కే అధికారిక కార్య‌క్ర‌మం. త‌ర్వాత‌.. ఆయ‌న ముచ్చింత‌ల్‌లోని రామానుజుల విగ్ర‌హాన్ని ఆవిష్క‌రించారు. ఇది పూర్తిగా ప్ర‌వేటు కార్య‌క్ర‌మం.

సో.. ఈ కార్య‌క్ర‌మానికి రాష్ట్ర బీజేపీ చీఫ్‌గా, ఎంపీగా.. బండి సంజ‌య్‌కూడా హాజ‌ర‌య్యారు. అయితే.. ఈ కార్య‌క్ర‌మంలో మోడీ.. సంజ‌య్‌ను పెద్ద‌గా రిసీవ్ చేసుకోలేద‌నే కామెంట్లు వినిపిస్తున్నాయి. సంజ‌య్‌ను చూసి.. మోడీ ఒక చిన్న‌పాటి చిరున‌వ్వు న‌వ్వి.. త‌న ప‌నితాను చేసుకునిపోయార‌ట‌. నిజానికి కార్య‌క్ర‌మం ఆసాంతం బండి ఉన్నా కూడా.. ఆయ‌న‌ను ప‌ల‌క‌రించ‌డం కానీ.. కుశ‌ల ప్ర‌శ్న‌లు వేయ‌డం కానీ.. మోడీ చేయ‌లేదు. దీనిని పార్టీలోనే కీల‌క నేత‌లు సీరియ‌స్‌గా చ‌ర్చించుకుంటున్నారు.

బండికి మోడీ ద‌గ్గర అంత యాక్స‌స్ లేద‌ని.. వారు చ‌ర్చించుకోవ‌డం గ‌మ‌నార్హం. బండి ఎన్ని చేసినా.. మోడీ ద‌గ్గ‌ర మాత్రం మార్కులు ప‌డ‌లేద‌ని.. వారు అంటున్నారు. అందుకే మోడీ ముభావంగానే ప‌ల‌క‌రించీ ప‌ల‌క‌రించ‌న‌ట్టు వ్య‌వ‌హ‌రించార‌ని.. చెబుతున్నారు. ప్ర‌స్తుతం ఈ విష‌యం రాజ‌కీయంగా ఆస‌క్తిగా మారింది. బండి త‌న స్థాయిని ఇంకా పెంచుకోవాలి..ఇప్పుడు కేవ‌లం గ‌ల్లీ స్థాయి నుంచి నెమ్మ‌దినెమ్మ‌దిగా ఎదుగుతున్నాడ‌ని అంటున్నారు. మ‌రి బండి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.
Tags:    

Similar News