గుంటూరు ఘటన మళ్లీ గుంతకల్లుతో రిపీట్ అయ్యింది. హైటెక్ ముఖ్యమంత్రి.. సమర్థుడైన పాలకుడిగా పేరొందిన చంద్రబాబు పాలనలో ఏపీ ఆసుపత్రుల దుస్థితి చూసిన వారికి నోట మాట రాని పరిస్థితి. ఆ మధ్యన గుంటూరులో ఒక చిన్నారిని ఎలుకలు కొరికే చనిపోయిన విషాద ఘటన నుంచి ఇంకా బయటకు రాకముందే.. ఆసుపత్రి వార్డుల్లో ఎలుకలు.. పందికొక్కుల ఆరాచకం మరోసారి బయటకు వచ్చింది.
అనంతపురం జిల్లా గుంతకల్లులో చోటు చేసుకున్న ఈ ఘటన సంచలనం సృష్టించటమే కాదు.. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వాసుపత్రుల దుస్థితిని చెప్పకనే చెప్పినట్లుగా ఉంది.
అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం పందికుంట గ్రామానికి చెందిన లక్ష్మి కాన్పు కోసం గుంతకల్లు ప్రభుత్వాసుపత్రికి వచ్చింది. శనివారం ఉదయం ప్రసవం అయిన ఆమెకు ఆడపిల్ల పుట్టింది. ఆమెకు సాయంగా ఉండేందుకు లక్ష్మీ తల్లి ఎర్రమ్మ ఆసుపత్రికి వచ్చింది. రాత్రి పడుకున్న వేళ.. ఆ వార్డులోకి ప్రవేశించిన పందికొక్కు ఎర్రమ్మ కాలును కొరికేయటతో భయంతో కేకలు వేయటం.. అక్కడి వారు పందికొక్కులను తరిమారు. రక్తస్రావం అయిన ఆమెను ఆసుపత్రిలోని నర్సులు వైద్యం చేశారు. ఏపీని అద్భుతంగా మార్చేస్తానని చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు అద్భుతం సంగతి తర్వాత.. ఏపీలోని ఆసుపత్రులో భయం లేకుండా మనుషులు ఉండేలా ఏర్పాట్లు చేస్తే సరి. ఎలుకలు.. పందికొక్కుల్లేని ఆసుపత్రుల నిర్వహణ అంత కష్టమా చంద్రబాబు..?