తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు దాదాపుగా వచ్చేసినట్టే. అధికార టీఆర్ ఎస్ ను గద్దె దించడం ఒక్కటే పరమావధిగా కాంగ్రెస్‌తో జట్టు కట్టిన టీడీపీ - టీజేఎస్ - సీపీఎంల యత్నాలు ఏమాత్రం ఫలించలేదు. గులాబీ దళపతి - తెలంగాణ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖరరావు వల్లె వేసినట్టుగానే తెలంగాణ ప్రజలు టీఆర్ ఎస్ కు బ్రహ్మరథం పట్టినట్టుగా ఫలితాలు స్పష్టం చేస్తున్నాయి. మొత్తం 119 అసెంబ్లీ స్థానాలున్న తెలంగాణలో దాదాపుగా వంద సీట్లకు కాస్తంత అటుఇటుగా గెలుపు అవకాశాలున్న టీఆర్ ఎస్... రాజకీయాల్లో అతిరథ మహారథులైన నేతలను మట్టి కరిపించేస్తోంది. ఇప్పటిదాకా ఓటమే ఎరుగని టీ కాంగ్రెస్ సీనియర్ నేత - ప్రజా కూటమి అధికారంలోకి వస్తే సీఎం అయ్యేంత ఛాన్స్ లున్న జానారెడ్డి వంటి నేతలు కూడా కౌంటింగ్ లో బాగా వెనుకబడిపోయారు. జీవన్ రెడ్డి లాంటి ప్రజాదరణ ఉన్న నేత కూడా ఇప్పటికే ఓటిమిపాలైపోయారు. ఫలితాలు పూర్తయ్యేలోగా ఇంకెంత మంది కాంగ్రెస్ కు చెందిన కీలక నేతలు ఓటమిపాలవుతారో చూడాలి.
ఇదంతా బాగానే ఉన్నా... ఎన్నికల ప్రచారం సందర్భంగా కాంగ్రెస్ పార్టీ తరఫున ఆ పార్టీ నేతలు బీరాలు పలికిన వైనం ఇప్పుడు ఆసక్తికరంగా మారిపోయింది. ఎన్నికలకు ఏడాదికి ముందుగానే గడ్డం పెంచేసిన టీ పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి.... ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాతే గడ్డం తీస్తానంటూ శపథం చేశారు. ఇక అదే పార్టీకి చెందిన మరో కీలక నేత కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి... కాంగ్రెస్ ఓడినా - తాను ఓడినా రాజకీయాల నుంచి శాశ్వతంగానే తప్పుకుంటానని కూడా సంచలన ప్రకటన చేశారు. ఇలాంటి చాలా మంది కీలక నేతలు చేసిన సంచలన ప్రకటనలన్నీ ఒక ఎత్తైతే... ఎన్నికలకు కాస్తంత ముందుగా రంగంలోకి దిగేసి... ఏకంగా కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీతోనే ఫొటో దిగి ట్విట్టర్ లో హల్ చల్ చేసి... ఆ తర్వాత ఏకంగా కాంగ్రెస్ పార్టీకే కొత్త ప్రభ తీసుకొస్తానన్నంత రేంజిలో ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్న టాలీవుడ్ కమెడియన్ - నిర్మాత బండ్ల గణేశ్ చేసిన వ్యాఖ్యలు - పలికిన బీరాలు ఇప్పుడు అందరి మదిలో మెదలువుతున్నాయి.
అయినా బండ్ల గణేశ్ ఏమన్నారన్న విషయానికి వస్తే... ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బంపర్ మెజారిటీతో గెలుస్తుందని - అలా కాని పక్షంలో తాను బ్లేడుతో గొంతు కోసుకుంటానని ఆయన ఆసక్తికర కామెంట్ చేశారు. అప్పటిదాకా కాంగ్రెస్ పార్టీ నతలంతా చేసిన కామెంట్లు ఒక ఎత్తైతే... బండ్ల గణేశ్ చేసిన కామెంట్ మరో ఎత్తుగా కనిపించింది. పార్టీ ఓడితే... ఏదో రాజకీయ సన్యాసమో - పోటీకి దూరంగా ఉంటానని చెప్పడం వరకైతే ఓకే గానీ... పార్టీ ఓడితే... ఏకంగా చేజేతులారా బ్లేడుతో గొంతు కోసుకుంటానని ప్రకటించడమంటే కాస్త ఆసక్తికరమే కదా. అందుకే ఫక్తు కమెడియన్ గా కనిపించే బండ్ల చేసిన కామెంట్ అందరికీ బాగానే ఎక్కేసిందనే చెప్పాలి. ఈ క్రమంలో నేటి ఉదయం కౌంటింగ్ ట్రెండ్స్ మొదలు కాగానే... ప్రతి ఒక్కరికి ముందుగా బండ్ల గణేశే గుర్తుకు వచ్చినట్టున్నారు. కాంగ్రెస్ ఓడితే గొంతు కోసుకుంటానంటూ ఆయన చేసిన కామెంట్ కు సంబంధించిన వీడియోను ట్విట్టర్ లో పోస్ట్ చేసిన కొందరు నెటిజన్లు... సినిమాల్లో బండ్ల గణేశ్ చేసిన కామెడీకి మించిన స్థాయిల్లో ట్వీట్ల వర్షం కురిపించడం మొదలుపెట్టారు.
కాంగ్రెస్ పార్టీ ఓడింది కదా... ఎక్కడ బ్లేడు అందుబాటులో ఉంటే... బండ్ల గొంతు కోసుకుంటాడోనని వెటకారం చేసిన ఓ నెటిజన్... 7 ఓ క్లాక్ బ్లేడు అతడికి అందుబాటులో ఉంచొద్దంటూ ట్వీటాడు. ఇంకో నెటిజన్ అయితే... బండ్ల గొంతు కోసుకుంటే ఎలా... కనీసం కామెడీ పండించడానికి అయినా ఆయన ఉండాల్సిందే కదా అంటూ హాస్యమాడాడు. ఇక మరో నెటిజన్ అయితే... ఓ సినిమాలో ఏదో విషయంలో విఫలమైన కోలీవుడ్ హీరో ధనుష్ కత్తితో గొంతు కోసుకునేందుకు యత్నించే వీడియోను పోస్ట్ చేసి బండ్లను కెలికేశాడు. ఇక ఇంకో నెటిజన్ అయితే బండ్ల ఒరిజినల్ కేరెక్టర్‌ను గుర్తు చేస్తూ... సినిమా కలెక్షన్ల విషయంలో తప్పుడు అంకెలు వేసుకుని సంబరపడే బండ్ల గణేశ్... రాజకీయాల్లోనూ అలా కుదురుతుందని భ్రమ పడినట్టున్నారంటూ మరింత సెటైరికల్ కామెంట్లు చేశాడు. మొత్తంగా ఏ ఒక్కరూ ఊహించనంత మెజారిటీతో టీఆర్ఎస్ గెలవబోతుండటం, అదే సమయంలో కాంగ్రెస్ పార్టీ కొంప కొల్లేరు కానున్న నేపథ్యంలో బండ్ల గణేశ్ ఎలా స్పందిస్తాడోనన్న అంశంపై అంతటా ఆసక్తి నెలకొంది.