సినీ నిర్మాత, నటుడు బండ్ల గణేష్ ఇటీవలే ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ సమక్షంలో కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు.. అలా చేరాడో లేదో.. ఇలా కాంగ్రెస్ పీసీసీ పెద్దలతోనే తిరుగుతూ ప్రచార పర్వంలో తనదైన ముద్ర వేస్తున్నారు. ఇటీవలే జోగులాంబ గద్వాల నుంచి కాంగ్రెస్ మొదలు పెట్టిన ప్రచారంలో బండ్ల ప్రధానాకర్షణగా కనిపించారు. తాజాగా హూజూర్ నగర్ లో ప్రచారం ప్రారంభించిన పీసీసీ ఉత్తమ్ కు తోడుగా ఎన్నికల ప్రచారంలో బండ్ల సందడి చేశారు.
హూజూర్ నగర్ లో పీసీసీ చీఫ్ కంటే కూడా బండ్ల గణేష్ ప్రసంగానికి ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. పవన్ అభిమానులంతా ‘గబ్బర్ సింగ్’ నిర్మాత అంటూ గట్టిగా అరుస్తూ బండ్లకు స్వాగతం పలకడం విశేషం. మాస్ లో బండ్లకున్న క్రేజ్ చూసి ఉత్తమ్ కూడా షాకయ్యారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. బండ్లకున్న క్రేజ్ చూసి ఆశ్చర్యపోయిన పీసీసీ చీఫ్ ఉత్తమ్.. బండ్లతో తెలంగాణలోని ముఖ్యమైన అసెంబ్లీ స్థానాల్లో ప్రచారం చేయించాలని డిసైడ్ అయినట్టు సమాచారం. పవన్ అభిమానులంతా తెలంగాణలో బండ్ల గణేష్ వెంట నడుస్తుండడం కాంగ్రెస్ కు ప్లస్ అవుతుందని కాంగ్రెస్ భావిస్తోంది.
బండ్ల గణేష్ ఈసారి జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీచేయాలని భావిస్తున్నారు. కాంగ్రెస్ కూడా బండ్లకు అదే సీటును ఆఫర్ చేస్తోందట.. అయితే టీడీపీ తరఫున ఇటీవలే మరణించిన నందమూరి హరికృష్ణ కుమారుడు కళ్యాణ్ రామ్ ను బరిలోకి దింపాలని యోచిస్తున్నారట.. కళ్యాణ్ రామ్ బరిలో ఉంటే బండ్లకు వేరే సీటు ఇస్తామని చెప్పారట.. ఒకవేళ కళ్యాణ్ రామ్ పోటీ చేయకపోతే జూబ్లిహిల్స్ నుంచే బండ్లకు సీటు ఖాయమని ఉత్తమ్ హామీ ఇచ్చినట్టు తెలిసింది.
2014లో జూబ్లిహిల్స్ స్థానం నుంచి టీడీపీ తరఫున నిలబడి మాగంటి గోపినాథ్ గెలుపొందారు. ఆయన అనంతరం కారెక్కేశారు. ఈసారి 2019 ఎన్నికల్లో టీఆర్ఎస్ టికెట్ పొంది పోటీచేస్తున్నారు. దీంతో కాంగ్రెస్ - టీడీపీ మధ్య సీట్ల తకరారు, టీఆర్ఎస్ నుంచి తాజామాజీ అభ్యర్థి కారణంగా జూబ్లిహిల్స్ లో పోరాటం ఆసక్తికరంగా మారింది.