కరోనా వేళ.. అన్ని భయాలే. ఎప్పుడు ఏం జరుగుతుందో అర్థం కాని అనిశ్చితి. నిజాల సంగతి ఎలా ఉన్నా.. అబద్ధాలు.. అసత్యాలు అదే పనిగా సర్య్కులేట్ అవుతున్నాయి. దీంతో.. కన్ఫ్యూజన్ అంతకంతకూ ఎక్కువ అవుతోంది. తాజాగా అలాంటిదే మరొకటి ఇప్పుడు జోరుగా నడుస్తోంది. కరోనా వేళ.. కరెన్సీ నోట్ల ద్వారా వైరస్ వ్యాప్తి చెందుతుందన్న వాదన అంతకంతకూ ఎక్కువ అవుతోంది.దీంతో.. చాలామంది డబ్బులు తీసుకోవటానికి భయ పడుతున్నారు.
ఇలాంటివేళ.. ఇండోనేషియాకు చెందిన ఒక వ్యక్తి తన దగ్గరున్న నోట్లను బక్కెట్లో వేసి.. నీళ్లతో శుభ్రం చేసుకునే వీడియో వైరల్ గా మారింది. నిజంగానే కరెన్సీ నోట్లతో కరోనా వ్యాప్తి చెందుతుందన్న శాస్త్రీయ ఆధారం లేనప్పటికీ.. ప్రముఖ వైద్యులు.. సన్ షైన్ అధినేత డాక్టర్ గురువారెడ్డి తయారు చేసిన వీడియోలోనూ కరెన్సీ నోట్లతో కరోనా వచ్చే ప్రమాదం ఉందన్న హెచ్చరికలు చేశారు. కానీ.. అలాంటిదేమీ ఉండదని చెబుతున్నారు మిగిలిన వారు. ఏది నిజం అన్నది చూస్తే.. ఇప్పుడున్న పరిస్థితుల్లో దేన్ని నమ్మలేని పరిస్థితి ఉందంటున్నారు.
కాకుంటే.. కరెన్సీ నోట్లతో కరోనా వ్యాప్తి చెందే అవకాశం ఉండదని.. ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా ఇదే విషయాన్ని చెప్పటం గమనార్హం. కాకుంటే.. కొందరు నిపుణులు చేస్తున్న సూచన ఏమంటే.. కరెన్సీ నోట్లను తీసుకున్న తర్వాత చేతులు ముఖానికి తగలకుండా చూసుకోవటం.. వెంటనే శానిటైజర్ వాడితే మంచిదంటున్నారు. అలా చేస్తే సేఫ్ గా ఉండొచ్చన్న వాదనను వినిపిస్తున్నారు. కరెన్సీతో కరోనా వస్తుందా? రాదా? అన్నది పక్కన పెడితే.. కాస్త జాగ్రత్తగా ఉండటం తప్పనిసరి.