ప్రేమకథ ఏదైనా కిక్కు ఇస్తుంది. కొత్త ఉత్సాహాన్ని నింపుతుంది. ఇద్దరు అపరిచితుల మధ్య పుట్టే ప్రేమ సరికొత్తగా ఉంటుంది. ఆ విషయంలో ఎవకిరి ఎలాంటి డౌట్ ఉండదు. ఈ ప్రపంచంలో పుట్టే ప్రతి ప్రేమకథ భిన్నమే. ఏ కథ.. రెండో కథను పోలి ఉండదు. అందుకే.. ప్రతి ప్రేమకథ ఉత్సుకతను.. ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రేమకథల్లో ఇద్దరి ప్రేమికుల రియల్ జీవితాలు ఉంటాయి.
మరి.. సామాన్యుల ప్రేమకథే ఇంత ఆసక్తికరంగా ఉంటే.. మరి ప్రపంచానికి పెద్దన్న అయిన అమెరికా అధ్యక్షుడి ప్రేమకథ మరెంత ఆసక్తిగా ఉంటుంది. ఇప్పుడు సరిగ్గా అదే విషయాన్ని తీసుకొని సినిమా రూపొందించే ప్రయత్నం చేస్తున్నారు. అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా.. మిషెల్ ఒబామాల ప్రేమకథను సినిమాగా తీస్తున్నారు.
వీరిద్దరి రియల్ ప్రేమకథతో ఈ సినిమా రూపొందించనున్నారు. సౌత్ సైడ్ విత్ యూ పేరిట ఉండే ఈ సినిమాను గ్లెన్డన్ పాల్మర్ తెరకు ఎక్కిస్తున్నారు. పాతికేళ్ల కిందట పుట్టిన వీరి ప్రేమకథలోని ప్రతి ఘట్టాన్ని అద్భుత చిత్రకావ్యంగా మలచటం గ్యారెంటీ అంటున్నారు. 1989 ప్రాంతంలో ఒబామా.. మిషెల్ ఇద్దరు కలిశారు. వారి పరిచయం ప్రేమగా మారి.. పెళ్లితో మరింతగా ముడిపడింది. ఇపపటివరకూ బయటకు రాని ఎన్ని అంశాలు ఈ సినిమాలో ఉంటాయో మరి..?