అమెరికా అధ్యక్ష ఎన్నికల క్రతువు తుది అంకానికి చేరుకుంది. అధ్యక్ష ఎన్నికల్లో కీలకమైన పోలింగ్ రోజుల్లోకి వచ్చేసింది. దీంతో.. అధ్యక్ష పదవి కోసం పోటీ పడుతున్న ఇద్దరు అభ్యర్థులతో పాటు.. అమెరికా అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్న బరాక్ ఒబామా సైతం.. తాను ప్రాతినిధ్యం వహించే డెమొక్రాట్ల అభ్యర్థి తరఫున ప్రచారాన్ని షురూ చేశారు. తాజాగా ఆయన నార్త్ కరొలినాలో జరిగిన ఎన్నికల ర్యాలీలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన అమెరికా ప్రజలను మేలుకొలిపేలా వార్నింగ్ లాంటి అలెర్ట్ ఒకటి చెప్పారు.
రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ ను కానీ అమెరికా అధ్యక్షుడిగా ఎన్నుకుంటే... అది ప్రపంచానికే ప్రమాదకరంగా పరిణమిస్తుందని ఆయన అభివర్ణించారు. పౌర హక్కులకు ట్రంప్ ప్రమాదకారి అని చెప్పిన ఆయన.. అమెరికన్ ప్రజాస్వామ్య పరిరక్షణ ప్రజల (తన మద్దతుదారులను ఉద్దేశించి) చేతుల్లో ఉందని ఆయన వ్యాఖ్యానించారు. నార్త్ కలోలినా ఓటర్లు సరిగానే వ్యవహరిస్తారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసిన ఒబామా.. తాను పోటీలో లేను కాబ్టటి ఓటర్లు ఓట్లు వేసే ముందు బాగా ఆలోచించుకొని ఓటు వేయాలన్నారు. ట్రంప్ ను వైట్ హౌస్ కు రాకుండా అడ్డుకోవటానికి ఓటు హక్కు ఒక్కటే సరైన మార్గంగా ఆయన అభివర్ణించారు.
ట్రంప్ ను తీవ్రంగా విమర్శించిన ఒబామా.. తమ పార్టీకి చెందిన అభ్యర్థి హిల్లరీ క్లింటన్ పై పొగడ్తల వర్షం కురిపించారు. దేశ అధ్యక్ష పదవికి ఆమె సరైన అభ్యర్థిగా ఆయన అభివర్ణించారు. హిల్లరీ గెలుపుతో గడిచిన కొన్ని సంవత్సరాలుగా అమెరికా సాధించిన అభివృద్ధి మరింత దూసుకెళుతుందని.. అందుకు హిల్లరీ నాయకత్వం అవసరమని వ్యాఖ్యానించారు. నార్త్ కరోలినాలో పార్టీ గెలిస్తే.. యావత్ దేశంలోనూ గెలుపు సాధించినట్లేనని.. అందుకే చరిత్ర సృష్టించే అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఓటర్ కోల్పోవద్దని ఒబామా వ్యాఖ్యానించారు. అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కు కొద్ది రోజుల ముందు హిల్లరీ ఈ మొయిల్స్ వ్యవహారంపై విచారణ జరిపిస్తామంటూ ఎఫ్ బీఐ డైరెక్టర్ జేమ్స్ కమీ తీసుకున్న నిర్ణయం సరికాదని ఒబామా వ్యాఖ్యానించటం గమనార్హం.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/