హిల్ల‌రీకి ఊహించని మద్దతు లభించింది!

Update: 2016-10-04 12:23 GMT
అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌లు మాంచి హీట్ లో ఉన్నాయి. ఈ నేప‌థ్యంలో శ‌నివారం నాడు న్యూయార్క్ రాష్ట్రంలో ఒక నిధుల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. డెమొక్ర‌టిక్ పార్టీ అభ్యర్థి హిల్ల‌రీ క్లింట‌న్ కోసం ఈ నిధుల సేక‌ర‌ణ కార్య‌క్ర‌మం జ‌రిగింది. హిల్ల‌రీ స‌హాయ‌కురాలు హుమా అబిదెన్ ఈ ఫండ్ రైజర్ ఈవెంట్ నిర్వ‌హించారు. ఈ కార్య‌క్ర‌మం ఇప్పుడు అమెరికా సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది! ఈ కార్య‌క్ర‌మానికి ఒక అనుకోని అతిథి రావ‌డం - హిల్ల‌రీ త‌ర‌ఫున జ‌రుగుతున్న ఫండ్ రైజింగ్ లో ఆమె పాల్గొన‌డం.. ఎవ్వ‌రూ ఊహించ‌ని ప‌రిణామాలు. ఇంత‌కీ ఆ అనూహ్య అతిథి ఎవర‌నుకున్నారు... అమెరికా మాజీ అధ్య‌క్షుడు జార్జ్ బుష్ కుమార్తె బ‌ర్బారా పియ‌ర్స్ బుష్‌.

త‌ర‌త‌రాలుగా రిప‌బ్లిక‌న్ పార్టీకి చెందిన ఫ్యామిలీ ఆమెది. అదే పార్టీలో ఉంటూ రెండు ద‌ఫాలు అమెరికా అధ్య‌క్ష పీఠాన్ని కైవ‌సం చేసుకున్న నేప‌థ్యం ఉన్న కుటుంబం బ‌ర్బారాది. అలాంటి ఫ్యామిలీ నుంచి వ‌చ్చిన బ‌ర్బారా.. డెమొక్రటిక్ పార్టీ అభ్య‌ర్థి హిల్ల‌రీ కార్య‌క్ర‌మానికి మ‌ద్ద‌తు ప‌ల‌క‌డం అనేది క‌చ్చితంగా ఆశ్చ‌ర్యానికి గురిచేసే ప‌రిణామ‌మే. నిజానికి - ఈ ఫండ్ రైజింగ్ కార్య‌క్ర‌మంలో కేవ‌లం ప‌ది నిమిషాలు మాత్ర‌మే బ‌ర్బారా ఉన్న‌ది. కానీ, ఆమె ఇలా వ‌చ్చిందో లేదో.. చ‌క‌చ‌కా ఫొటోలో క్లిక్ మ‌నేశాయి. వెంట‌నే సోష‌ల్ మీడియాలోకి అవి వెళ్లిపోయాయి. అవికాస్తా ఇప్పుడు వైర‌ల్ అయిపోతున్నాయి.

దీంతో సొంత పార్టీ అభ్య‌ర్థి ట్రంప్ కి బుష్ ఫ్యామిలీ ఎంత వ్య‌తిరేకంగా ఉన్నార‌నేది సుస్ప‌ష్ట‌మైపోయింది. నిజానికి, హిల్ల‌రీ అభ్య‌ర్థిత్వానికి జార్జి బుష్ ఇంత‌వ‌ర‌కూ మ‌ద్ద‌తు ప్ర‌క‌టించ‌లేదు! కాక‌పోతే.. ట్రంప్ అధ్య‌క్షుడు కావ‌డం ఆయ‌న‌కి ఇష్టం లేదు. అందుకే ఇంత‌వ‌ర‌కూ రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థి త‌ర‌ఫున ఎలాంటి ప్ర‌చార కార్య‌క్ర‌మంలోనూ ఆయ‌న నేరుగా పాల్గొన‌లేదు. ఇంకోప‌క్క బుష్ సోద‌రుడు కూడా ట్రంప్ ను ఎలాగైనా ఓడించాల‌న్న ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. ఎందుకంటే, రిప‌బ్లిక‌న్ అభ్య‌ర్థిత్వం కోసం ట్రంప్ తో ఆయ‌న పోటీ ప‌డ్డాడు. ట్రంప్ ను త‌ట్టుకోలేక ఎల‌క్ష‌న్స్ నుంచి త‌ప్పుకున్నారు. ఇక‌, హిల్ల‌రీకి సీనియ‌ర్ బుష్ ఆశీస్సులు ఉన్నాయి. ఆమెకే ఓటు వేయాల‌ని బాహాటంగా ఆయ‌న ప్ర‌క‌టించారు. ఇంకేముంది... బుష్ ఫ్యామిలీ స‌పోర్ట్ హిల్ల‌రీకి బాగానే ఉంది!


Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News