ఫార్మింగ్టన్ హిల్స్ - మిషిగాన్ - అమెరికా: October 8 - డెట్రాయిట్ తెలంగాణ కమ్మ్యూనిటి (డి.టి.సి.) మరియు ఎన్. ఆర్ .ఐ తెలంగాణ జాగ్రుతి ఆధ్వర్యంలో మిషిగాన్ ఛరిత్రలోనే అతిఫెద్ధ బతుకమ్మ పండుగను తెలంగాణ సంస్కృతి - సాంఫ్రదాయాలను అద్దంపట్టేలా చాలా ఘనంగా నిర్వహించారు. ఫార్మింగ్టన్ హిల్స్ పట్టణంలో సుప్రసిద్ద సెయింట్ తోమా చర్చిలో - డెట్రాయిట్ పదకొండో బతుకమ్మ పండుగ ఉత్సవాల కోసం ఫెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసి దిగ్విజయంగా నిర్వహించారు. తెలంగాణ సంస్కృతి - సాంఫ్ర సంప్రదాయాలను మిషిగాన్ ఫ్రవాస భారతీయులకు అద్దం పట్టేలా చూపించే ఈ కార్యక్రమమును డి.టి.సి. కన్నుల పండుగగా నిర్వహించారు.
ఈ బతుకమ్మ సంబరాలకు పలుఫ్రాంతాలనుండి దాదాపు 2000 మందికిపైగా తెలంగాణ మరియు ఇతర ప్రవాస భారతీయులు తరలి వచ్చారు. డెట్రాయిట్ నగర చుట్టు ప్రాంతాల వారే కాకుండా లాన్సింగ్ - ఫ్లింట్ - జాక్సన్ - టొలీడొ - కెనడా తదితర ప్రాంతాల నుండి ఈ సంబరాలకు వచ్చేశారు. ఐదు గంటల పాటు నిర్విరామంగా జరిగిన ఈ బతుకమ్మ వేడుకల్లో తెలంగాణ సంస్కృతి - సాంఫ్రదాయాలు వెల్లివిరిశాయి.
శనివారం సాయంత్రం ఆహ్లాదకరమైన వాతావరణంలో రంగురంగుల దుస్తులలో వచ్చిన మహిళలతొ, అందంగా అలంకరించబడిన బతుకమ్మలతో ప్రాంతమంతా కిక్కిరిసిపోయింది. మహిళలు ఎంతో కష్టపడి రంగురంగుల పూలతో తయారుచేసిన పెద్ద బతుకమ్మలను ట్రక్కులలో తీసుకొచ్చి ఉత్సాహంగా జరుపుకోవడం ఈ సంవత్సరపు విశేషం. సాయి బాబ దేవాలయం ప్రధాన పూజారి నిర్వహించిన జమ్మి పూజ మరియు గౌరి పూజతో బతుకమ్మ పండుగ మొదలైంది. రంగురంగుల పూలతో అలంకరించిన బతుకమ్మల చుట్టు చేరి మహిళలు - చిన్నారులు చప్పట్లు కొడుతూ "బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో బంగారు బతుకమ్మ ఉయ్యాలో" అంటూ ఎంతో ఉత్సాహంగా ఆడిపాడారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రముఖ గాయని ఆదర్శిని బతుకమ్మ పాటలు పాడి బతుకమ్మ ఆటను రక్తి కట్టించారు. అనంతరం సాంప్రదాయబద్దంగా బతుకమ్మలను నీటిలో నిమజ్జనం చేశారు.
పిండి వంటకాలు - తెలంగాణ సాంప్రదాయిక విందు భొజనం అంధరికి వడ్డించారు. చకినాలు - గారెలు - మిర్చిబజ్జీలు - రకరకాల గుడాలు - పులిహోరాలు - లడ్డూలు మరియు ఇతర వంటకాలు తెలంగాణేతరులను కూడా చాలా ఆకర్షించాయి.
సభ మరియు సాంస్క్తుతిక కార్యక్రమాలను డీ. టీ. సీ అధ్యక్షులు కొట్టే భుజంగ రావు గారు స్వాగతోపన్యాసం తో ప్రారంభించారు, చైర్మన్ రాంగోపాల్ ఉప్పుల గారు డీ. టీ. సీ కార్యక్రమాల గురించి వివరించారు. అనంతరం తెలంగాణ జాగ్రుతి ఎన్. ఆర్ .ఐ అధ్యక్షుడు శ్రీధర్ బండారు, సమన్వయకర్త మురళి బొమ్మనవేని అమెరికాలో మరియు తెలంగాణాలో తమ సంస్థ చేస్తున్న వివిధ కార్యక్రమాల గురించి మాట్లాడారు. ఈ కార్యక్రమానికి సహాయపడిన దాతలు ఎన్. ఆర్ .ఐ తెలంగాణ జాగ్రుతి - టాటా - ఆటా సంస్థ ప్రతినిధులని మరియు మేగాన్ సాఫ్ట్ సంస్థ యజమాని శ్రీని సీత ను ఘనంగా సత్కరించారు. మంచి రుచికరమైన తెలంగాణ వంటకాలను అందించిన బావార్చి రెస్టారెంట్ వారికీ, తమ నైతిక మద్దతు తెలిపిన ఇతర స్థానిక డిట్రాయిట్ తెలుగు మరియు భారతీయ సంఘాల ప్రతినిధులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆ పిదప ఈ కార్యక్రమానికి విశేష కృషి చేసిన డి.టి.సి. కార్యవర్గం సభ్యులను కార్యకర్తలని మరియు వాలంటీర్లను వేదిక పైకి పిలిచి కరతాళ ధ్వనులతో కృతజ్ఞతలు తెలిపారు.
ఆ పిదప సాంస్కృతిక కార్యక్రమాలు విజయ్ పల్లెర్ల మరియు శిరీష రెడ్డి వ్యాఖ్యాతగా ప్రారంభమయి అర్థరాత్రి వరకు కొనసాగాయి. గాయని ఆదర్శిని తన అమోఘమైన పాటలతో శ్రోతలను మంత్ర ముగ్దుల్ని చేసింది. కెనడా నుండి వచ్చిన నృత్యకారుడు నాయక్ తన వైవిధ్యమైన నృత్యాలతో అందరిని ఉర్రుతలూగించాడు. స్థానిక చిన్నారులు కూడా పాటలు మరియు నృత్యాలతో అందరిని అలరించారు.
ఈ కార్యక్రమ నిర్వాహణకు విశేషంగా కృషి చేసిన శైలేంద్ర సనం - హరి పరాంకుశం - రాజు బ్రహ్మాండభేరి - రాజ్ మాడిశెట్టి - కృష్ణ గుడిగుంట్ల - హరి మారోజు - నాగేందర్ ఐత - భరత్ మదాడి - మరియు ఇతర వాలంటీర్లు అందరికి భుజంగ రావు గారు క్రుతజ్ఞతలు తెలియజేశారు.