భారత క్రికెట్ సంఘం (బీసీసీఐ) నియంత్రణ మండలి అధ్యక్షుడు జగ్మోహన్ దాల్మియా (75) ఆదివారం రాత్రి మృతి చెందారు. కొద్ది రోజులు గా అస్వస్థత తో బాధ పడుతున్న ఆయన ఈ రోజు రాత్రి కలకత్తా లోని బీఎం బిర్లా ఆసుపత్రి లో చికిత్స పొందుతూ మృతిచెందారు. గత గురువారం ఆయనకు గుండె పోటు రావడం తో ఆయన్ను కుటుంబ సభ్యులు అత్యవసర చికిత్స కోసం బీఎం బిర్లా ఆసుపత్రి కి తరలించారు.
భారత క్రికెట్ రంగం కొత్త పుంతలు తొక్కడంతో పాటు, బీసీసీఐ ప్రపంచం లోనే తిరుగు లేని ఆర్థిక శక్తి గా ఎదగడం లో ఆయన చేసిన కృషి మరువలేనిది.
1990లో దాల్మియా బీసీసీఐ బాధ్యతలు స్వీకరించే సమయాని కి బోర్డు రూ.81 లక్షల లోటు లో ఉండగా ఏడాది లోనే అది రూ.100 కోట్ల టర్నోవర్ తో ప్రపంచం లోనే అత్యధిక సంపన్నమైన క్రికెట్ బోర్డు గా రికార్డుల కెక్కింది. 1940 లో కలకత్తా లో జన్మించిన ఆయనకు క్రికెట్ అంటే అమితమైన ఆసక్తి. కళాశాల రోజుల్లో పలు క్లబ్ ల తరపున ఆడిన మ్యాచ్ ల్లో వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వహించేవారు. అక్కడ నుంచి అంచెలంచెలుగా ఎదిగిన దాల్మియా భారత క్రికెట్ రంగాన్ని మూడు దశాబ్దాల పాటు శాసించారు. తర్వాత పదేళ్ల పాటు బీసీసీఐ కార్యకలాపాలకు దూరంగా ఉన్న ఆయన తిరిగి బీసీసీఐ బాధ్యతలు స్వీకరించారు. ఈయన హయాంలోనే బెంగాల్ టైగర్ సౌరవ్ గంగూలీ ఓ వెలుగు వెలిగాడు.