తక్షణమే స్పందించండి ... నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌పై సీఎం దిశానిర్దేశం !

Update: 2021-04-27 12:30 GMT
రాష్ట్రంలో రోజురోజుకి కరోనా మహమ్మారి పాజిటివ్ కేసులు పెరిగిపోతున్న నేపథ్యంలో 104 కాల్ సెంటర్ సమర్ధవంతంగా పనిచేసేలా కలెక్టర్లు దృష్టి పెట్టాలని సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో మంగళవారం ఆయన స్పందన వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. కరోనా వైరస్ నివారణ చర్యలు, వ్యాక్సినేషన్‌ పై సీఎం వైఎస్‌ జగన్‌ దిశానిర్దేశం చేస్తూ ,104కు ఫోన్‌ చేసిన వారికి తక్షణమే పరిష్కారం చూపాలన్నారు. కరోనా సమస్యలకు 104 నంబర్‌ వన్‌ స్టాప్‌ గా ఉండాలని అన్నారు.

104కు ఫోన్ చేసిన మూడు గంటల్లో బెడ్ కేటాయించాలి. 104 కాల్‌ సెంటర్‌కు వైద్యులు అందుబాటులో ఉండాలి. జాయింట్ కలెక్టర్లు ఇక నుంచి కోవిడ్‌పైనే దృష్టి పెట్టాలి. ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలి. జిల్లా స్థాయిలో కోవిడ్ ఆస్పత్రులను క్లస్టర్లుగా విభజించాలి. జిల్లా స్థాయి ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ ఏర్పాటు చేయాలి. ఆస్పత్రుల్లో వైద్య సిబ్బంది, పారామెడికల్ సిబ్బంది పూర్తిస్థాయిలో ఉండాలి. ఆస్పత్రుల్లో ఖాళీల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహించి తక్షణమే రిక్రూట్ చేసుకోవాలని అన్నారు.ప్రభుత్వాసుపత్రులతో పాటు నెట్‌ వర్క్‌ ఆస్పత్రుల్లో అందుతున్న సేవలపై నిరంతరం నిఘా ఉంటుందని పేర్కొంది. రోగుల కుటుంబాలకు సమాచారం అందించే నిమిత్తం ఏర్పాటు చేసిన కంట్రోల్‌ రూంలు, 104 కాల్‌ సెం టర్లకు అందుతున్న ఫిర్యాదులను జేసీలు పరిష్కరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.  ఇకపై పెళ్లిళ్లకు కేవలం 50 మందికి మాత్రమే అనుమతి ఉంటుందన్నారు.

రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన మేరకు మెడికల్‌ ఆఫీసర్లు, వైద్య సిబ్బందిని నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది. ఆరు నెలల కాలపరిమితితో కాంట్రాక్ట్‌ పద్దతిన కోవిడ్‌ రోగులకు వైద్య సేవలందిం చేందుకు నియమించుకోవాలని కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేసింది.కోవిడ్‌ నియంత్రణకు అవసరమైన 1170 మంది స్పెషలిస్టులతో పాటు మరో 1170 మంది జనరల్‌ డ్యూటీ మెడికల్‌ ఆఫీసర్లు, 2వేల మంది స్టాఫ్‌ నర్స్‌లు, 306 మంది అనస్తీషియా టెక్నీషియన్లు, 330 మంది ఎఫ్‌ఎన్‌ఓలు, 300 మంది ఎంఎన్‌ఓ, మరో 300 మంది స్వీపర్ల నియామకానికి నోటిఫికేషన్‌ జారీ చేసింది.
Tags:    

Similar News