లాక్ డౌన్ షరతులు సడలిస్తూ తెలుగు రాష్ట్రాలు రెండింట్లోనూ మద్యం అమ్మకాలు పున:ప్రారంభించినపుడు మందుబాబులు ఎలా ఎగబడ్డారో తెలిసిందే. రెండు నెలల పాటు మద్యానికి దూరంగా ఉన్న వాళ్లు.. ఒక్కసారిగా వైన్ షాపుల మీద దాడి చేశారు. మద్యం ధరలు కూడా పెంచడంతో భారీగా ఆదాయం వచ్చింది. లాక్ డౌన్ వల్ల మద్యం అమ్మకాలు ఆపేయడం వల్ల వచ్చిన నష్టమంతా తర్వాతి నెలల్లో పూడిపోయింది. ఐతే తెలంగాణలో ఓవరాల్‌గా మద్యం అమ్మకాలు బాగున్నా, ఆదాయానికి ఢోకా లేకున్నా.. బీరు అమ్మకాలు బాగా పడిపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. గత ఏడాది మే-సెప్టెంబరు మధ్య ఐదు నెలలతో పోలిస్తే.. ఈ ఏడాది ఐదు నెలల్లో ఏకంగా సగానికి సగం బీర్ అమ్మకాలు పడిపోయాయి. నిరుడు ఈ ఐదు నెలల్లో 2.21 కోట్ల కేసుల బీర్లు అమ్ముడయ్యాయి. కానీ ఈ ఏడాది ఆ సంఖ్య 1.16 కోట్ల కేసులకు పడిపోయింది.
తెలంగాణలో లాక్ డౌన్ తర్వాత 20 శాతం మద్యం ధరలు పెరిగిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో దాదాపు అన్ని బ్రాండ్ల బీర్ ధరలూ రూ.200కు అటు ఇటుగా అయ్యాయి. ఒక్క బీర్ మీద ఇంత ధర పెట్టడం కంటే దాని కంటే ఎక్కువ కిక్కిచ్చే క్వార్టర్ విస్కీ, బ్రాందీ లాంటివి మేలని అటు వైపు మళ్లుతున్నారు మందు బాబులు. కరోనా భయం కూడా ఇందుకు ఒక కారణంగా కనిపిస్తోంది. కూలింగ్ లేకుండా బీర్ తాగలేరు. కూల్ బీర్ తాగితే జలుబు, దగ్గు రావడానికి ఆస్కారముంది. కరోనా టైంలో జలుబు, దగ్గు అంటే జనాలు అనుమానంగా చూస్తారు. అందుకు బీర్ పట్ల విముఖత కనిపిస్తున్నట్లుంది. పైగా బీర్ అమ్మకాలు అధికంగా ఉండేది వేసవిలో కాగా.. పీక్ సమ్మర్లో సగం రోజులు మద్యం దుకాణాలు మూతబడి ఉన్నాయి. మళ్లీ మద్యం దుకాణాలు మూతపడతాయేమో అన్న భయంలో చాలామంది వైన్ షాపులు పున:ప్రారంభం అయినపుడు విస్కీ, బ్రాందీ బాటిళ్లే ఫుల్స్ కొని పెట్టేశారు. ఇలా బీర్లు కేసులు కేసులు కొని నిల్వ చేయడం కూడా కష్టమే. ఇలా అనేక కారణాల వల్ల బీర్ల అమ్మకాలు బాగా తగ్గినట్లు స్పష్టమవుతోంది. మరోవైపు ఏపీలో బ్రాండెడ్ మద్యం బంద్ అయిన నేపథ్యంలో బీర్ల అమ్మకాలు మరింత తగ్గినట్లు తెలుస్తోంది.