మ‌హా సంక్షోభంలోకి మ‌మ‌త ఎంట్రీ.. ఏం జ‌రిగిందంటే!

Update: 2022-06-23 10:30 GMT
మహారాష్ట్ర రాజకీయ సంక్షోభం ముదురుతోంది. శివ‌సేన‌-కాంగ్రెస్‌-ఎన్సీపీ ఉమ్మ‌డి స‌ర్కారుపై శివ‌సేన ఎమ్మెల్యే క‌మ్ మంత్రి ఏక‌నాథ్ షిండేతిరుగుబావుటా ఎగ‌రేసిన విష‌యం తెలిసిందే. అంతేకాదు.. త‌న‌కు మ‌ద్ద‌తిస్తున్న పార్టీల‌తో ఆయ‌న శిబిరాలునిర్వ‌హిస్తున్నారు. ఈ శిబిరాల‌ను కూడా ఆయ‌న మారుస్తున్నా రు. బుధ‌వారం ఉద‌యం వ‌ర‌కు గుజ‌రాత్‌లోని సూర‌త్‌లో ఉన్న షిండే.. బుధ‌వారం సాయంత్రానికి.. అసోంకు మ‌కాం మార్చేశారు.

అయితే.. ఏమైందో ఏమోతెలీదు కానీ.. గురువారం ఉద‌యం నాటికి.. ఈ అస‌మ్మ‌తి ఎమ్మెల్యేల బృందం గువ‌హాటి చేరుకుంది. ఈ నేప‌థ్యంలో బెంగాల్ సీఎం, టీఎంసీ అదినేత్రి.. మ‌మ‌తా బెన‌ర్జీ ఈ రాజ‌కీయాల పై ఆస‌క్తిగా రియాక్ట్ అయ్యారు.

మ‌హా సంక్షోభం నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ అనూహ్యంగా రంగ ప్రవేశం చేసింది. గువహటిలో శివసేన రెబల్ ఎమ్మెల్యేలు బస చేస్తున్న 'రాడీసన్ బ్లూ' హోటల్ వద్ద హైడ్రామా నెలకొంది.

హోటల్ వెలుపల తృణమూల్ కాంగ్రెస్‌కు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, కార్యకర్తలు పెద్దఎత్తున ఆందోళన నిర్వహిస్తున్నారు. శివసేన ఎమ్మెల్యేలను బీజేపీ కొనుగోలు చేసిందంటూ నినాదాలు చేస్తున్నారు.

అసోం  రాష్ట్రం వరదల్లో చిక్కుకున్న వేళ బీజేపీ రాజకీయాల్లో మునిగిపోయిందంటూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్ర‌స్తుతం అసోం వ‌ర‌ద‌ల్లో 150 మంది పౌరులు చ‌నిపోగా.. 12 జిల్లాల్లో బ్ర‌హ్మ‌పుత్ర న‌ది ఉదృతంగా ప్ర‌వ‌హిస్తోంది.

ఈ నేప‌థ్యంలో అక్క‌డి ప్ర‌జ‌ల క‌న్నా.. కూడా మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన స‌ర్కారును కూల‌దోయ‌డ‌మే.. బీజేపీ ల‌క్ష్యంగా పెట్టుకుంద‌ని మ‌మ‌త ఫైర్ అయ్యారు.  కాగా రెబల్ ఎమ్మెల్యేలు బసచేస్తున్న 'రాడీసన్ బ్లూ' హోటల్‌ను అసోం బీజేపీ మంత్రి అశోక్ సింఘాల్ సందర్శించారు. అక్కడి వసతి సౌకర్యాలను పర్యవేక్షించారని పలు రిపోర్టులు వెలువడుతున్నాయి. నేపథ్యంలో తృణమూల్ నిరసనలు మొదలయ్యాయి.
Tags:    

Similar News