నిబంధనలు పుస్తకాలకు మాత్రమే పరిమితం అంటూ పలువురు విమర్శలు చేస్తుంటారు. ఇలాంటి వారి మాటల్ని అస్సలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని.. చట్టం..న్యాయం.. ఏదో ఒక రోజున.. ఏదో ఒక రూపంలో పని చేస్తుంటాయని.. అందుకు నిదర్శనం అమ్మ.. చిన్నమ్మలు జైలు ఊచలు లెక్కేయటమే నిదర్శనంగా చెప్పేవారు ఉంటారు. అయితే.. అందులో నిజం సగమేనని.. రూల్ బుక్ లో చెప్పిన రూల్స్ చిన్నమ్మ లాంటి పవర్ ఫుల్ నేతల విషయంలో అస్సలు పని చేయమన్న విషయం మరోసారి ఆధారాలతో సహా నిరూపితమైంది.
అక్రమాస్తుల కేసులో దోషిగా నిరూపితమై.. కర్ణాటకలోని పరప్పన అగ్రహార జైల్లో శిక్ష అనుభవిస్తున్న చిన్నమ్మ.. జైల్లో సాదాసీదా ఖైదీగా కాలం గడుపుతున్నట్లుగా మొదట్లో వార్తలు వచ్చాయి. తమిళనాడుకు సీఎం కావాల్సిన ఆమె.. కాస్త తేడాతో సీఎం కుర్చీలో కాకుండా.. జైలుగదిలో కాలం గడపటంపై అప్పట్లో చాలానే వార్తలు వచ్చాయి. తనకుకేటాయించిన గదిలో టీవీ ఏర్పాటు చేయాలని కోరితే.. జైలు సిబ్బంది మొహమాటం లేకుండా నో చెప్పేసినట్లుగా చెప్పుకొచ్చారు.
అయితే.. అవన్నీ మూణ్నాళ్ల ముచ్చటేనన్న విషయం తేలిపోయింది. తాజాగా ఒక ప్రముఖ మీడియా సంస్థ జైలు రిజిష్టర్‌ను సంపాదించింది. అందులో.. విజిటర్స్ వివరాల్ని.. రూల్ బుక్ తో క్రాస్ చెక్ చేశారు. దీంతో.. దిమ్మ తిరిగి.. మైండ్ బ్లాక్ అయ్యే వాస్తవం ఒకటి బయటకు వచ్చింది. చిన్నమ్మ ఉన్న జైలు అధికారులు.. చిన్నమ్మ అధికారానికి సాగిలపడుతున్న వైనం బట్టబయలైంది. రూల్ ప్రకారం.. ఖైదీ ఎవరైనా పదిహేను.. నెల రోజులకు ఒక్కసారి మాత్రమే విజిటర్స్‌ను కలుసుకునే వీలు ఉంటుందని.. కానీ.. చిన్నమ్మ విషయంలో మాత్రం రూల్స్ ను ఇష్టారాజ్యంగా బ్రేక్ చేస్తున్నారని తేల్చారు.
తాజాగా వెల్లడైన జాబితా ప్రకారం 2017 ఫిబ్రవరి 16 నుంచి మార్చి 8 మధ్య వరకు చిన్నమ్మను కలవటానికి పెద్ద సంఖ్యలో విజిటర్స్ వచ్చినట్లుగా తేలింది. ఇలా వచ్చిన వారిలో లాయర్లు.. ఎంపీలు.. ఎమ్మెల్యేలు ఉన్నట్లుగా తేలింది. మొత్తం 31 రోజుల వ్యవధిలో 27 మంది విజిటర్లు చిన్నమ్మను కలవటానికి వచ్చినట్లుగా లెక్క తేల్చారు. ఆమే కాదు.. ఇదే కేసుకు సంబంధించి చిన్నమ్మ బంధువర్గం కూడా ఇదే తీరులో నిబంధనల్ని ఉల్లంఘిస్తున్నట్లు తేలింది.
అంతేకాదు.. వీరిని కలవటానికి వచ్చే వారి కోసం జైలు టైమింగ్స్ కు భిన్నంగా సాయంత్రం 5 గంటల తర్వాత కూడా అనుమతిస్తున్నట్లుగా బయటకు వచ్చింది. అంతేకాదు.. కోర్టు పేర్కొన్నట్లు సామాన్య ఖైదీలా ట్రీట్ చేయకుండా.. వీవీఐపీ ఖైదీని ట్రీట్ చేసినట్లుగా తేలింది. మరిన్ని విషయాలు బయటకు వచ్చిన నేపథ్యంలో.. న్యాయస్థానం ఏ తీరులో రియాక్ట్ అవుతుందో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/