ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ దుర్మరణం ఘటనపై బెంజ్ కంపెనీ వితండ వాదన చేస్తోందని పోలీసు వర్గాలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. గత నెల 10వ తేదీన తెల్లవారుజామున జూబ్లీహిల్స్ రోడ్ నెం. 36లో బెంజ్ కారు నడుపుతూ మితిమీరిన వేగంతో వెళ్లి మెట్రో పిల్లర్ ను ఢీకొట్టిన ఘటనలో అక్కడికక్కేడ మృతి చెందిన ఏపీ మంత్రి నారాయణ కుమారుడు నిషిత్ నారాయణ ఘటనలో బెంజ్ కంపెనీ క్షేత్రస్థాయి పరిశీలన చేసిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే నిషిత్ ఆయన స్నేహితుడు మృతిచెందిన తీరుతో బెంజ్ వాహనాల భద్రతపై అనుమానాలు తలెత్తాయి.
మే 10వ తేదీ తెల్లవారుఝామున నిషిత్ ప్రయాణిస్తోన్న బెంజ్ కారు జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 36లో ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. అడ్వాన్స్‌డ్ ఫీచర్లు ఉన్న కారు అయినప్పటికీ.. ప్రమాదంలో ఇద్దరు యువకులు మృతి చెందారు. అతివేగం వల్లే ప్రమాదం జరిగి ఉంటుందని ప్రాథమికంగా అంచనాకు వచ్చిన పోలీసులు.. దర్యాప్తులో భాగంగా కార్ల కంపెనీ నుంచి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశారు.
ఈ క్రమంలోనే నిషిత్ నారాయణ కారు ప్రమాదంలో మృతి చెందిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు బెంజ్ కంపెనీకి లేఖ రాశారు. సీటు బెల్టు పెట్టుకుంటేనే బెలూన్లు ఓపెన్ అవుతాయా - పెట్టుకోకున్నా ఓపెన్ అవుతాయా అన్న వివరాలతో పాటు ఎంత స్పీడ్ లో వెళ్తే మృతి చెందే అవకాశాలున్నాయో చెప్పాలంటూ పోలీసులు లేఖ రాశారు. దీనికి స్పందించిన బెంజ్ సంస్థ క్షేత్రస్థాయి అధ్యయనానికి సిద్ధమైంది. గత నెల 16వ తేదీన బెంజ్ ప్రతినిధులు ఘటనా స్థలంలో విచారణ చేపట్టారు. కారును కూడా పరిశీలించారు. అయితే నివేదిక ఇవ్వడంలో తీవ్ర జాప్యం జరిగింది.
తాజాగా బెంజ్ కార్ల సంస్థ నుంచి నిషిత్ మృతిని దర్యాప్తు చేస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులకు విస్తుగొలిపే సమాధానం వచ్చింది. వాహనానికి సంబంధించిన వివరాలు కావాలంటే కేసు దర్యాప్తు వివరాలు - పోస్టుమార్టం నివేదిక పంపాలని బెంజ్ సంస్థ ప్రతినిధులు కోరారు. దీనిపై పోలీసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. బెంజ్ కంపెనీ ప్రతినిధుల లేఖ వితండ వాదనకు అద్దం పడుతోందని అంటున్నారు. తమ రిపోర్ట్ ఆధారంగా వారి కంపెనీ ఉత్పత్తి గురించి వివరణ ఇవ్వడం ఏమిటని జూబ్లీహిల్స్ పోలీసులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/