శ్రీకాకుళం జిల్లాకు ఆశాకిరణం భావనపాడు పోర్టు. ఈ ప్రాజెక్టు వెనక కలలకు దశాబ్దాల చరిత్ర ఉంది. ఎన్నో ప్రతిపాదనలు, మరెన్నో ఆలోచనలు, కార్యరూపం మాత్రం ఎప్పటికీ దాల్చడంలేదు. దానికి ఏలికల ఉదాశీనత ప్రధాన కారణం అయితే పోర్టు నిర్మాణం ద్వారా ఏర్పడే నిర్వాసితులను ఎలా డీల్ చేయాలన్న దాని మీద ఎలాంటి స్పష్టత లేకపోవడం మరో కారణం.
నిజానికి వెనకబడిన శ్రీకాకుళానికి భావనపాడు పోర్టు వస్తే డెవలప్మెంట్ యాక్టివిటీ పెరుగుతుంది. జిల్లా అభివృద్ధి చెందుతుంది. కానీ ప్రధాన సమస్యను టచ్ చేయకుండా నాడు టీడీపీ నేడు వైసీపీ అదే తప్పు చేస్తూ ముందుకు పోవడం వల్ల భావనా పాడా బాధలపాడా అని జనాలు గుర్రుమంటున్నారు.
ఈ పోర్టు పరిధిలో అనేక గ్రామాల ప్రజలు తమ వేలాది ఎకరాల భూములను కోల్పోతారు. వారి నుంచి భూ సేకరణ చేసి కానీ పోర్టు యాక్టివిటీ మొదలుపెట్టలేరు. ఆ విషయంలో చట్టం ప్రకారం వారికి నష్టపరిహారం చెల్లించాలి. అయితే మార్కెట్ విలువ కంటే తక్కువకు బేరాలు పెడుతూ ఏకపక్ష నిర్ణయాలతో అధికారులు ప్రభుత్వ పెద్దలు వారి మీద వత్తిడి తేవడంతో మాకొద్దీ పోర్టు అనే పరిస్థితి వచ్చింది.
నాడు టీడీపీ హయాంలో కూడా ఇదే రకంగా పరిస్థితి ఏర్పడింది. టీడీపీ అయితే భూ సేకరణకు రెండు సార్లు నోటిఫికేషన్ ఇచ్చి వెనక్కి తగ్గాల్సి వచ్చింది. నిజానికి పోర్టు వల్ల కలిగే లాభాలను వివరించి అటు స్థానిక ప్రజలను ఒప్పించాల్సిన పరిస్థితులకు భిన్నంగా పాలకులు అధికారులు సాగుతూండడంతో భావనపాడు పోర్టు కేవలం కాగితాలకే పరిమితం అవుతోంది అంటున్నారు.
ప్రజాగ్రహం ముందు నాటి టీడీపీ సర్కార్ తలొగ్గితే ఇపుడు వైసీపీ సర్కార్ కూడా వాటి నుంచి గుణపాఠాలు నేర్చుకోకుండా ముందే నోటిఫికేషన్లు ఇచ్చేసి గ్రామాల్లో జెండాలు పాతేసి మావీ ఈ భూములు అంటూ తాపీగా ప్రజాభిప్రాయ సేకరణకు దిగడం దారుణం అంటున్నారు. ఇక అధికార్లు కూడా సామరస్యంగా వెళ్లకుండా రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్న తీరుతో కూడా భావపాడు సమీప గ్రామాల ప్రజలు విసిగిపోతున్నారు.
భూమి విలువ బాగా పెరిగిన నేపధ్యం ఒక వైపు ఉంది, మరో వైపు చూస్తే అధికారులు జనాల భావనను ఏ కోశానా పట్టించుకోకుండా మంచి ప్యాకేజీలు ఇస్తామని ప్రకటనలు చేయడంతో పోర్టు నిర్మాణం ఆపాలి అని ప్రజా ఉద్యమం మొదలైంది. స్థానిక ఎమ్మెల్యే, మంత్రి అయిన సీదరి అప్పలరాజు కూడా ఈ విషయంలో దృష్టి పెట్టి ఇప్పటికైనా స్థానిక ప్రజలకు నచ్చచెప్పాలి. లేకపోతే భావనపాడు పోర్టు అన్నది ఎప్పటికీ ఎవరూ కూడా కట్టలేరు అన్నది నిజం. వేలాది ఎకరాల భూమిని సేకరిస్తామని చెబుతున్న నేపధ్యంలో ప్రజలతో మంచిగా వ్యవహరించకపోతే ప్రాజెక్టు ఏదైనా ముందుకు ఎలా వెళ్తుంది అన్నది ఆలోచించాలి కదా.