గంగా జలాలతో కరోనా నిరోధం.. బీహెచ్.యూ అధ్యయనం

Update: 2020-09-16 02:30 GMT
గంగా జలాలు అత్యంత పవిత్రమని దేశంలో భక్తులంతా నమ్ముతారు. ఒక్కసారైనా గంగలో మునిగి పునీతం కావాలని ఆరాటపడుతారు. అనేక రకాల వ్యాధులను నయం చేసే ఔషధ గుణాలు గంగా జలాల్లో ఉన్నట్లుగా పరిగణిస్తారు.

అయితే ఈ గంగా జలాలతో కరోనా మహమ్మారికి ఔషధాన్ని కనుగొనడం కోసం బెనారస్ హిందూ విశ్వవిద్యాలయం (బీహెచ్.యూ) పరిగణలోకి తీసుకొని అధ్యయనాలు నిర్వహిస్తోంది. తాజాగా ప్రయోగాలను మానవులపై కూడా నిర్వహించబోతోంది. ఎథికల్ కమిటీ అనుమతి కోసం ఈ పరిశోధక బృందం ఎదురుచూస్తోంది.

తాజాగా ఈ పరిశోధనను ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ మైక్రోబయాలజీ కూడా ఆమోదించింది. గంగా జలాలు అనేక వ్యాధులకు ఔషధ కారకంగా పనిచేస్తాయని సంప్రదాయబద్దంగా పరిగణిస్తారని చెప్పారు. కరోనా చికిత్సలో గంగా నది ఔషధ పాత్రను పోషించవచ్చుననే ఆలోచన తమకు వచ్చిందని తెలిపారు.

గంగానదిలో బ్యాక్టీరియా కన్నా మూడు రెట్లు అధికంగా బ్యాక్టీరియోఫాగేస్ ఉంటాయి. నేషనల్ ఎన్విరాన్ మెంటల్ ఇంజనీరింగ్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ వెల్లడించిన వివరాల ప్రకారం.. గంగా నదిలో బ్యాక్టీరియో ఫాగేస్ దాదాపు 1100 రకాలు ఉన్నాయి. యమునా నది, నర్మదా నదిలో సుమారు 200 రకాల బ్యాక్టీరియో ఫాగేస్ మాత్రమే ఉన్నాయి.

ఇవన్నీ కూడా కరోనాను నియంత్రించగలవా అన్న దానిపై బీహెచ్,యూ పరిశోధన చేస్తోంది. ఇది తేలితే మన గంగ నది ప్రాశస్త్రం మరింత ఇనుమడింప చేస్తోంది.
Tags:    

Similar News