రాయల సీమ ముఖద్వారం కర్నూలు జిల్లాలో ఇప్పుడు కొత్త రచ్చ మొదలయ్యింది. అది కూడా అధికార టీడీపీలో రాజుకున్న ఈ రచ్చ నానాటికీ మరింత జఠిలంగా మారుతున్న సంకేతాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఈ రచ్చకు జిల్లాలో రాజకీయంగా మంచి ప్రాబల్యం ఉన్న భూమా ఫ్యామిలీనే కేంద్ర బిందువు కావడంతో ఇప్పుడు ఈ రచ్చ రాష్ట్రమంతా పాకేసింది. ఎన్నికలకు ముందు తల్లి మరణంతో అదాటుగా ఎమ్మెల్యేగా పిన్న వయసులోనే అసెంబ్లీలో అడుగుపెట్టిన ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియకు... తండ్రి భూమా నాగిరెడ్డి హఠాన్మరణంతో ఏకంగా మంత్రి పదవే దక్కేసింది. అంతేనా... భూమా మరణంతో నంద్యాల ఎమ్మెల్యేలగా భూమా సోదరుడి కుమారుడు బ్రహ్మానందరెడ్డి కూడా పిన్న వయసులోనే ఎమ్మెల్యేగా అయిపోయారు. అయితే టీడీపీలో సర్వసాధారణంగా ఎప్పటికప్పుడు ఎగసి పడే గ్రూపు రాజకీయాల కారణంగా ఇప్పుడు భూమా అఖిల ఏకంగా టీడీపీ అధినేత - ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడికే ఝలక్కిచ్చేందుకు సిద్ధమయ్యారన్న వార్తలు ఇప్పుడు ఎక్కడ లేని ఆసక్తిని కలిగిస్తున్నాయి.
ఈ రచ్చకు సంబంధించిన పూర్తి వివరాల్లోకెళితే... అఖిల మంత్రిగా పదవీ బాధ్యతలు స్వీకరించాక నంద్యాలలో భూమా ఫ్యామిలీకి అత్యంత ఆప్తుడిగా ఉన్న ఏవీ సుబ్బారెడ్డి దాదాపుగా తిరుగుబాటు చేసినంత పనిచేశారు. అయితే చంద్రబాబు కాస్తంత వేగంగానే స్పందించి సుబ్బారెడ్డి - అఖిలను పిలిచి సయోధ్య కుదిర్చారు. అయితే ఈ సయోధ్య బాబు కేబిన్ నుంచి బయటకు వచ్చేదాకా మాత్రమే పని చేసింది. అమరావతి నుంచి సొంతూళ్లు చేరుకునేలోగానే మళ్లీ అఖిల - సుబ్బారెడ్డి విడిపోయారు. ఇద్దరి మధ్య ఇప్పటికీ మాటలు లేవు. ఈ క్రమంలో గత వారం భూమా అఖిల ప్రియ అనుచరుల ఇళ్లల్లో పోలీసుల సోదాలు జరిగాయి. అంతేకాకుండా అఖిల ముఖ్య అనుచరుడిగా ఉన్న ఓ తెలుగు తమ్ముడిపై పోలీసులు ఏకంగా పీడీ యాక్టు కింద కేసు పెట్టేశారు. దీంతో ఒక్కసారిగా భగ్గుమన్న అఖిల... తనకు ప్రభుత్వం కేటాయించిన గన్ మెన్ ను వెనక్కు పంపేశారు. సివిల్ పోలీసుల భద్రత కూడా అవసరం లేదని ఘీంకరించిన అఖిల... జన్మభూమి కార్యక్రమాలకు సెక్యూరిటీ లేకుండానే వెళ్లిపోతున్నారు. దీంతో అప్పటికప్పుడు రంగంలోకి దిగిన పోలీసు బాసులు - పార్టీ నేతలు ఆమెకు సర్దిచెప్పేందుకు యత్నించినా ఫలితం లేకపోయింది.
మొన్న సీఎం హోదాలో చంద్రబాబు కర్నూలు జిల్లాకు వస్తే... ఆ కార్యమక్రమాలకు అఖిల పూర్తిగా దూరంగా ఉండిపోయారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోయిందన్న వార్తలు జోరందుకున్నాయి. అదే సమయంలో నిన్న కర్నూలు వెళ్లి డిప్యూటీ సీఎం - హోం మంత్రి నిమ్మకాయల చినరాజప్ప... ఈ వివాదంలో అఖిలదే తప్పన్నట్లుగా మాట్లాడారు. వెరసి అఖిల మరింత కుతకుతలాడిపోయారు. వెంటనే టీడీపీకి రాజీనామా చేయనున్నట్లుగా లీకులు ఇచ్చేశారు. బయటకు తాను టీడీపీని వీడేది లేదని చెబుతూనే... సీఎం కార్యక్రమాలకు వ్యక్తిగత కారణాలతోనే హాజరు కాలేదని, ఈ విషయాన్ని సీఎంకు ముందే చెప్పానని చెబుతున్న అఖిల... సైలెంట్ గానే తన భవిష్యత్తుకు సంబంధించిన కార్యాచరణలో నిమగ్నమైనట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. అఖిల టీడీపీని వీడేది ఖాయమేనని. అయితే ఎన్నికలకు సమయం ఆసన్నమవుతున్న వేళ... ఆమె ఏ పార్టీలోకి వెళతారనే కొత్త చర్చకు ఇప్పుడు తెర లేసింది. వాస్తవంగా ఆళ్లగడ్డ నుంచి అఖిల ఎమ్మెల్యేగా ఎన్నికైంది వైసీపీ నుంచే. అయితే ఆ తర్వాత బాబు విసిరిన ఆపరేషన్ ఆకర్ష్ కు పడిపోయిన భూమా నాగిరెడ్డి - అఖిలతో కలిసి టీడీపీలోకి జంపయ్యారు. ఆ తర్వాత ఆయన చనిపోవడం - అఖిల మంత్రిగా బాధ్యతలు స్వీకరించడం వెంటవెంటనే జరిగిపోయాయి.
ఈ నేపథ్యంలో అఖిల తిరిగి వైసీపీలోకే చేరతారా? లేదంటే... గతంలో తన తల్లిదండ్రులు ప్రజారాజ్యంలో చేరినట్టుగా అఖిల జనసేనలోకి చేరతారా? అన్న కోణంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. మొత్తగా అఖిల టీడీపీని వీడనున్నారన్న పుకార్లు ఇప్పుడు రాయలసీమలోనే కాకుండా రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారిపోయాయి. అయితే భూమా ఫ్యామిలీతో చంద్రబాబుకు ఆది నుంచి ఇబ్బందిక పరిస్థితులే ఎదురవుతున్నాయి. భూమా నాగిరెడ్డితో వేగడం చాలా కష్టమంటూ చాలా సార్లు మదనపడ్డ బాబు... ఇప్పుడు అఖిలతోనే ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన అఖిలను పిలిచి అనునయించేందుకు సంశయిస్తున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా.. ఎన్నికలకు ఇంకా నాలుగైదు నెలల సమయం ఉన్న నేపథ్యంలో అఖిల టీడీపీని వీడితే.. అది రాయలసీమ వ్యాప్తంగా ఆ పార్టీకి పెద్ద దెబ్బగానే విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చూద్దాం... ఏం జరుగుతుందో?
Full View