భూమాను బాగానే రిసీవ్ చేసుకున్నారు

Update: 2016-03-01 08:15 GMT
 విజయవాడలో జరిగిన టీడీపీ విస్తృత స్థాయి సమావేశంలో ఇటీవలే టీడీపీలో చేరిన భూమా నాగిరెడ్డి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు. ఒకప్పుడు టీడీపీలో కీలక నేతగా ఉన్న ఆయన అనంతరం వివిధ పార్టీలు మారుతూ వైసీపీలో చేరి మొన్నటి ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచారు. తాజాగా ఆయన మళ్లీ టీడీపీలో చేరడంతో ఈ సమావేశానికి కుమార్తె తో కలిసి హాజరయ్యారు. ఆయన సమావేశానికి వచ్చీరాగానే పాత స్నేహితులంతా ఆయన్ను ఆహ్వానించారు. ఆయన కూడా అందరి వద్దకు వెళ్లి కరచాలనాలు - ఆలింగనాలు చేశారు. చాలాకాలం తరువాత పార్టీ సమావేశానికి వచ్చిన భూమాను టీడీపీ నేతలు బాగా రిసీవ్ చేసుకున్నారు.

మొన్నటి ఎన్నికల్లో నంద్యాల నుంచి వైసీపీ టికెట్ పై గెలిచిన ఆయన తన కుమార్తె - ఆళ్లగడ్డ ఎమ్మెల్యే అఖిల ప్రియతో కలిసి ఇటీవలే చంద్రబాబు సమక్షంలో టీడీపీ గూటికి తిరిగి చేరారు. గతంలో కేఈ కృష్ణమూర్తితో ఉన్న విభేదాల కారణంగా ఆయన టీడీపీని వీడి అప్పటి సంచలన పార్టీ ప్రజారాజ్యంలో చేరారు. అనంతరం చిరంజీవి తన పార్టీని కాంగ్రెస్ లో కలిపేయడంతో భూమా వైసీపీలో చేరారు. తాజా రాజకీయ పరిణామాల్లో భాగంగా ఆయన మళ్లీ పాత గూటికి చేరారు.

కాగా టీడీపీ విస్తృత స్థాయి సమావేశం కావడంతో ఏపీ - తెలంగాణ టీడీపీ నేతలు కూడా ఈ సమావేశానికి వచ్చారు. భూమా సమైక్య రాష్ట్రంగా ఉన్నప్పుడు టీడీపీలో ఉండడంతో ఆయనకు ఇప్పటి రెండు రాష్ట్రాల నేతలతోనూ మంచి పరిచయాలున్నాయి. దీంతో తెలంగాణ - ఏపీ నేతలు భూమాతో ముచ్చటిస్తూ సరదాగా గడిపారు.
Tags:    

Similar News