అనుకున్నట్లే జరిగింది... పీఏసీ ఛైర్మన్ పదవికి భూమా నాగిరెడ్డి రాజీనామా చేశారు. కమిటీ సమావేశానికి హాజరై కీలక ఫైళ్లను సభ్యులకు అందజేసి రాజీనామా ప్రకటించారు.
అనంతరం భూమా మీడియాతో మాట్లాడినా పొడిపొడిగానే మాట్లాడారు. అయితే... టీడీపీలో చేరుతానన్న సంకేతాలు మాత్రం ఇచ్చారు. టీడీపీలో చేరుతారా అని విలేకరులుగా అడగ్గా దాన్ని ఆయన ఏమాత్రం ఖండించలేదు.... చెప్పాల్సిన సమయంలో చెబుతాను.. మీడియాకు చెప్పకుండా చేరను అన్నారు. ఎప్పుడు చేరుతారని విలేకరులు అడగడంతో ''ఇంకొన్ని రోజులు పట్టొచ్చు... లేదంటే కొన్నిగంటల్లోనే చేరిపోవచ్చు.. వెయిట్ అండ్ సీ'' అని అన్నారు. ఆయన ఈ రోజు సాయంత్రం విజయవాడ వెళ్లనుండడంతో అక్కడ చంద్రబాబు సమక్షంలో ప్రకటన చేస్తారని భావిస్తున్నారు.
ఇప్పటికే కడప జిల్లాకు చెందిన జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి విజయవాడలో ఉన్నారు. ఆయన కూడా ఈ రోజు సాయంత్రం చంద్రబాబుతో భేటీ అయి చేరికపై ప్రకటన చేస్తారని తెలుస్తోంది. దీంతో భూమా ప్రకటన కూడా ఈ రోజే ఉండొచ్చని భావిస్తున్నారు.